ఆకాశాన ఐపీఎల్ విలువ.. 2 లక్షల కోట్లకు చేరువైన లీగ్..!
ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ సీజన్‌కూ లీగ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్ అరుదైన మైలురాయి చేరుకుంది.