ఐపీఎల్లో కావ్యా మారన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానిగా ఉన్న కావ్యా మారన్ తమ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరై ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. ఎస్ఆర్హెచ్ గెలిచినా, ఓడినా కావ్యా మారన్ ఇచ్చే హావభావాలు హైలైట్‌గా నిలుస్తుంటాయి. అలాంటి కావ్యా మారన్‌కు పోటీగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా తమ కావ్యా మారన్‌ను పరిచయం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఆమె ఎవరో కాదు బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా పెద్ద కుమార్తె . ఆమె పేరు అనన్య బిర్లా.
ఇటీవల ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని కొనుగోలు చేసి కన్సార్టియంలో ఆమె కూడా ఉంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి జట్టును నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థ 16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది.ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీని దక్కించుకున్నాయి. బిర్లా కుమారుడు 28 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్‌కు అనన్య బిర్లా, ఆర్యమాన్ బిర్లా హాజరయ్యారు.
ఆర్సీబీ జెర్సీ ధరించిన అనన్య బిర్లా చేతితో ఆర్సీబీ జెండాను ఊపుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆమె ఇచ్చిన హావభావాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవైపు స్టాండ్స్‌లో కావ్యా మారన్ తన ఎస్ఆర్హెచ్ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తుంటే.. మరో స్టాండ్ నుంచి అనన్య బిర్లా కావ్యా మారన్‌కు పోటీగా ఆర్సీబీ జెండాను ఊపుతూ కనిపించింది. ఇది చూసిన అభిమానులు కావ్యామారన్ లాగే అనన్య బిర్లా కూడా సీజన్లో ఆర్సీబీ ఆడబోయే అన్ని మ్యాచ్‌లకు హాజరైతే బాగుంటుందంటున్నారు. మరి అనన్య బిర్లా తర్వాతి మ్యాచ్‌లకు కూడా హాజరవుతుందేమో చూడాలి. ఇక విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి అనన్య మ్యాచ్ వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.