వైభవ్ చేతికి టీమిండియా… జెర్సీ నెంబర్ ఎంతో తెలుసా..?

4 ఏళ్లకే ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి, 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ  టీమిండియా తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 3:10 PM IST

14 ఏళ్లకే ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి, 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ  టీమిండియా తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్టులో అతడు చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో అతడు తన పేరుతో భారత జెర్సీని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్.. తన జెర్సీ అందుకున్నాడు. జెర్సీ ఇచ్చేందుకు రఘు తన రూమ్ వద్దకు వచ్చినవెంటనే వైభవ్ ఏమాత్రం సంకోచించకుండా అతడి కాళ్లకు నమస్కరించాడు.

వైభవ్ సూర్యవంశీనికి ‘నంబర్ 3’తో భారత జెర్సీ అందింది. అతడు ఈ జెర్సీ ధరించే టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జెర్సీ అందుకున్న తర్వాత మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. భావోద్వేగానికి గురయ్యాడు. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు.భారత క్రికెట్‌లో కొత్తగా వచ్చే ఆటగాళ్లకు జెర్సీ నంబర్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ నంబర్ ఇప్పటికే వాడుకలో ఉండొద్దు, అంటే ఇప్పుడు టీమిండియా తరఫున ఆడుతున్న ఏ ప్లేయర్ కూడా ఆ నంబర్ ధరించనిదై ఉండాలి, అలాగే ప్రత్యేకంగా రిటైర్ చేయబడిన నంబర్ కాకూడదు. కాగా గతంలో నంబరు 3 జెర్సీతో భారత జట్టు తరఫున గతంలో ఇద్దరు ప్లేయర్లు ఆడారు.

స్పిన్నర్ హర్బజన్ సింగ్, ఆల్ రౌండర్ సురేశ్ రైనా.. ఈ నంబర్ జెర్సీతోనే జాతీయ జట్టు తరఫున ఆడారు. ఇప్పుడు వారు రిటైర్మెంట్ కావడంతో ఆ జెర్సీని వైభవ్‌కు కేటాయించారు. ఎడమచేతి వాటం దూకుడు ఓపెనర్‌గా పేరుగాంచిన వైభవ్ ఇప్పటికే తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో పాటు, 2026 ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే ట్రై-సిరీస్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు.ప్రతిభ, ధైర్యం, వయసు అన్నీ అతడికి అనుకూలంగా ఉండటంతో భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడనే అభిప్రాయం బలపడుతోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ యువ సంచలనం ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.

Published : 
  • 25 June 2026, 3:10 PM IST