Yuzvendra Chahal: వరల్డ్ కప్‌లో చాహల్‌కు నో ఛాన్స్.. కానీ, చాహల్ భార్యకు ఛాన్స్.. అదెలాగంటే..!

మణికట్టు మాయాజాలంతో వికెట్లను రాబట్టే చాహల్‌ను వరల్డ్ కప్‌లో ఆడించాల్సిందని వాపోతున్నారు. అయితే చాహల్‌కు అవకాశం దక్కకపోయినా అతడి భార్య ధనశ్రీ వర్మ మాత్రం ప్రపంచకప్ టీమ్‌లో భాగమైంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ యాంథెమ్‌‌లో చాహల్ సతీమణి భాగమైంది.

Post Published By: narender Thiru
Updated : 20 September 2023, 4:38 PM IST

Yuzvendra Chahal: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌తో పాటు త్వరలో మొదలుకాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్, వన్డే ప్రపంచకప్‌లలో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. చాహల్‌ను వన్డే టీమ్‌లో పట్టించుకోకపోవడంపై టీమిండియా అభిమానులు, మాజీ క్రికెటర్లు సెలక్టర్ల మీద గుర్రుగా ఉన్నారు. మణికట్టు మాయాజాలంతో వికెట్లను రాబట్టే చాహల్‌ను వరల్డ్ కప్‌లో ఆడించాల్సిందని వాపోతున్నారు. అయితే చాహల్‌కు అవకాశం దక్కకపోయినా అతడి భార్య ధనశ్రీ వర్మ మాత్రం ప్రపంచకప్ టీమ్‌లో భాగమైంది.

తాజాగా ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ యాంథెమ్‌‌లో చాహల్ సతీమణి భాగమైంది. వన్డే వరల్డ్ కప్ - 2023ను జనంలోకి తీసుకెళ్లేందుకుగాను వివిధ రూపాలలో ప్రచార కార్యక్రమాలను చేస్తున్న ఐసీసీ.. తాజాగా యాంథెమ్‌ను విడుదల చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో పాటు ఈ పాటలో ధనశ్రీ వర్మ కూడా ఆడిపాడింది. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను శ్లోక్ లాల్, సావేరి వర్మ రచించారు. ‘దిల్ జషన్ బోలే’ అంటూ సాగే ఈ గీతాన్ని ప్రీతమ్‌తో పాటు నకాష్ అజిజ్, శ్రీరామచంద్ర, అమిత్ మిశ్రా, జోనితా గాంధీ, అకాస, చరణ్‌ ఆలపించారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాట నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ధనశ్రీ వర్మ విషయానికొస్తే ఆమె యూట్యూబర్‌. అలాగే డాన్స్ టీచర్ కూడా.

ఆమె దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన యుజీ.. ఏకంగా ఆమెను ప్రేమలో దింపి, లవ్ డ్యూయెట్లు పాడుకుని, పెళ్లి కూడా చేసుకున్నాడు. డాన్స్‌లో దుమ్మురేపే ధనశ్రీ.. రణ్‌వీర్ సింగ్ డాన్స్‌‌ను మ్యాచ్ చేస్తూ అలరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న ధనశ్రీ.. వరల్డ్ కప్ యాంథెమ్‌కు మరింత గ్లామర్‌ తీసుకొచ్చింది. చాహల్ వరల్డ్ కప్‌లో భాగం కాకపోయినా కనీసం ఆయన భార్య అయినా ప్రపంచకప్‌లో మరో రకంగా భాగమైందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Published : 
  • 20 September 2023, 4:38 PM IST