అడల్ట్ స్టార్‌తో స్పిన్నర్ మెలికలు…!

భారత క్రికెట్ జట్టులో తనదైన స్పిన్ మ్యాజిక్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే యజువేంద్ర చాహల్, ఇప్పుడు మైదానం వెలుపల కూడా గట్టిగానే వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఈసారి ఆయన వార్తల్లో నిలిచింది తన బౌలింగ్ వల్ల కాదు, తన పర్సనల్ లైఫ్ మరియు సోషల్ మీడియా

Post Published By: dialnews
Updated : 17 April 2026, 2:15 PM IST

భారత క్రికెట్ జట్టులో తనదైన స్పిన్ మ్యాజిక్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే యజువేంద్ర చాహల్, ఇప్పుడు మైదానం వెలుపల కూడా గట్టిగానే వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఈసారి ఆయన వార్తల్లో నిలిచింది తన బౌలింగ్ వల్ల కాదు, తన పర్సనల్ లైఫ్ మరియు సోషల్ మీడియాలో ఒక అడల్ట్ స్టార్‌తో జరిగిన సంభాషణ వల్ల. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. క్రికెటర్ యజువేంద్ర చాహల్ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో ధనశ్రీ వర్మతో వివాహం, ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు తీసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలు కోకొల్లలు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, చాహల్ తన భార్య ధనశ్రీకి భారీ మొత్తంలో భరణం చెల్లించి విడాకులు తీసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఈ బాధ నుంచి కోలుకోకముందే, చాహల్ వరుసగా కొత్త కొత్త భామలతో కనిపిస్తూ మీడియా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. తాజాగా చాహల్ పేరు 'గందీ బాత్' వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన శృంగార తార తానియా ఛటర్జీతో ముడిపడి ఉంది. అసలు విషయం ఏమిటంటే, తానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫోటోకు చాహల్ లైక్ కొట్టడమే కాకుండా, పర్సనల్‌గా మెసేజ్ కూడా చేశాడట."నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు" అంటూ చాహల్ పంపిన మెసేజ్ చూసి తానియా ఉబ్బితబ్బిబ్బయిపోయింది.అంతటితో ఆగకుండా, తానియా ఈ విషయాన్ని ముంబై మీడియా ముందు బహిర్గతం చేసింది. చాహల్ తనకు పంపిన మెసేజ్‌ను లైవ్ కెమెరాల ముందు చూపిస్తూ పెద్ద హంగామానే చేసింది. దీంతో నెటిజన్లు చాహల్ "రొమాంటిక్ రైడ్" మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం తానియా మాత్రమే కాదు, చాహల్ పేరు మరో పాపులర్ టీవీ స్పోర్ట్స్ యాంకర్ షెఫాలీ బగ్గాతో కూడా వినిపిస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, డేటింగ్‌లో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.

చాహల్ గానీ, షెఫాలీ గానీ ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, పబ్లిక్ ప్లేస్‌లలో వీరిద్దరి సన్నిహిత్యం చూస్తుంటే ఏదో ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. గ్రౌండ్‌లో బంతులతో బ్యాటర్లను వణికిస్తున్న చాహల్, బయట మాత్రం భామలతో బిజీగా ఉండటంపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. "ఐపీఎల్‌లో వికెట్లు తీయడమే కాదు, బయట వికెట్లు పడగొట్టడంలోనూ చాహల్ కింగ్" అంటూ కొందరు జోకులు వేస్తుంటే, మరికొందరు మాత్రం చాహల్ పర్సనల్ లైఫ్ మీద వస్తున్న ఈ ఆరోపణల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యజువేంద్ర చాహల్ చుట్టూ అల్లుకున్న ఈ ప్రేమాయణాలు, విడాకుల వార్తలు మరియు అడల్ట్ స్టార్‌తో మెసేజ్‌ల వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకవైపు కెరీర్ పరంగా రాణిస్తున్నా, వ్యక్తిగత జీవితం మాత్రం నిత్యం వివాదాల్లో చిక్కుకోవడం చాహల్ అభిమానులను కలవరపెడుతోంది. మరి ఈ వార్తలపై చాహల్ నోరు విప్పుతాడా? లేదా సైలెంట్‌గానే తన "స్పిన్" కొనసాగిస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Published : 
  • 17 April 2026, 2:15 PM IST