టి20 వరల్డ్ కప్ లో చిన్న జట్లు సంచలనాలు నమోదు చేస్తూనే ఉన్నాయి. తమ సత్తా ఏంటో పెద్ద జట్లకు చూపిస్తాయి పసికూనలు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకు సఫారీలు షాక్ అయితే.. ఇప్పుడు జింబాబ్వే దెబ్బకు ఆస్ట్రేలియా షాక్ అయింది. ప్రపంచకప్ లో భాగంగా కొలంబోలో జరిగిన గ్రూప్ బీ మ్యాచ్ లో జింబాబ్వే.. ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో అసాధారణ విజయం సాధించింది. బ్రియాన్ బెన్నెట్ ఓపికగా 64 పరుగులు చేసి.. పోరాడే స్కోరు ఇవ్వగా మిగిలిన ఆటగాళ్ళు ఆ స్పూర్తితో చెలరేగి ఆడారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 169/2 పరుగులు చేసింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయినా.. చాలా పద్దతిగా ఆడింది జింబాబ్వే జట్టు. ముజారబాని 4 వికెట్లతో సత్తా చాటడం.. బ్రాడ్ ఎవాన్స్ 3 ఆసిస్ కు షాక్ ఇవ్వడంతో.. ఆస్ట్రేలియా కోలుకోలేదు. పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ డకౌట్ అయ్యారు. మాట్ రెన్షా 44 బంతుల్లో 65, గ్లెన్ మాక్స్వెల్ 32 బంతుల్లో 31 తిరిగి జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు, కానీ జింబాబ్వే తిరిగి పుంజుకుని ఆస్ట్రేలియాను 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ చేసింది.