SHOCK TO NANI: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ !
ఏపీలోని విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చింది. ఈనెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభ బాధ్యతలను కూడా కేశినేని చిన్నికి అప్పగించింది. ఇకపై పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా బాబు వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తిరువూరు టీడీపీ మీటింగ్ లో ఎంపీ కేశినేని నాని వర్గీయులు… నానా రచ్చ చేయడమే ఇందుక్కారణం.