Chevella

Telangana Congress : ఆ మూడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు.. కాంగ్రెస్‌ థర్డ్‌ లిస్ట్‌లో సంచలనాలు..

Telangana Congress : ఆ మూడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు.. కాంగ్రెస్‌ థర్డ్‌ లిస్ట్‌లో సంచలనాలు..

వనపర్తి (Wanaparthi), చేవెళ్ల (Chevella) , బోథ్‌ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలని.. వారికి బీ ఫామ్‌లు ఇవ్వొద్దని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. ఇక అటు ఫైనల్‌ లిస్ట్ అనౌన్స్‌ చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటివరకు 100స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19స్థానాలపై కసరత్తు దాదాపు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు.. కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో.. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.