NTR “Rs100 coin” : ఎన్టీఆర్ నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి..
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.