జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న రాయపాటి సాంబశివరావు త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు సీట్లకు వైసీపీ అధిష్టానం నుంచి హామీ లభిస్తే ఆయన గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
ఏపీ బీజేపీలో జంపింగుల కలకలం కొనసాగుతోంది. కన్నా లక్ష్మినారాయణ పార్టీకి కటీఫ్ చెప్పడంతో ఇంకెంతమంది నేతలు వెళ్లిపోతారోననే భయం ఆ పార్టీకి పట్టుకుంది.
నేతలు రావడం, పోవడం పొలిటికల్ పార్టీల్లో మామూలే… కానీ ఏపీ బీజేపీలో మాత్రం ఎగ్జిట్‌లే తప్ప ఎంట్రీలు ఉండటం లేదు. ఇలాగైతే ఎలా అంటూ కరడు గట్టిన కమలం కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు.
కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. జనసేనలో చేరతారని ఊహాగానాలు వచ్చినా సైకిలెక్కేందుకే ఆయన సిద్ధమైనట్టు తెలుస్తోంది.