CM kcr: అప్పుడు ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు జేపీఎస్‌లు.. కేసీఆర్‌కు ఎదురు మాట్లాడితే అణచివేత తప్పదా..
2019 నవంబర్ 9. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె తారా స్థాయికి చేరిన రోజది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు 3 నెలల పాటు విధులు బహిష్కరించి సమ్మె చేశారు. ప్రభుత్వం వాళ్లతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా చర్చలు సఫలం కాలేదు.