Chepa Mandu: చేప మందు ప్రసాదానికి సర్వం సిద్ధం.. కరోనా తర్వాత ఇదే మొదటిసారి..!
ప్రతి ఏటా మృగశిర కార్తె రోజు చేప మందు పంపిణీ జరుగుతుంది. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 9న చేప మందు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.