REVANTH REDDY: ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా.. స్పీకర్‌కు రాజీనామా పత్రం సమర్పణ..
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన మల్కాజిగిరి ఎంపీగా కొనసాగారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. నిబంధనల ప్రకారం తన రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.