NITI Aayog : ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం మమతా బెనర్జీకి ఘోర అవమానం.. సమావేశం నుంచి మమతా వాకౌట్..
ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే కాలంలో భారత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.