తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ..
నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ ఉదయం కలయుగిక దైవం.. తిరుమల శ్రీవారి సన్నిదిలో.. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.