ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పరిస్థితి కనిపిస్తోంది. లిస్ట్ అనౌన్స్‌మెంట్ వరుసగా వాయిదా పడుతూనే ఉంది. లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఫైనల్ అయినా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినా.. ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయ్.
