దక్షిణాదిని కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వ్యూహకర్త సునీల్ కనుగోలుయే కారణం. ఆయన రచించిన వ్యూహాలతోనే హస్తం పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో గెలిచింది. ఇదే ఉత్సాహంతో జనరల్ ఎలక్షన్స్ లోనూ సునీల్ వాడుకోవాలని ముందుగా అనుకుంది కాంగ్రెస్. కానీ సుదర్ఘ లక్ష్యాన్ని ఆలోచించి… ప్రస్తుతానికి ఆయన వ్యూహాలను హర్యానా, మహారాష్ట్రలో ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ అధిష్టానం.
