Top story: గణేషుడికి తాకిన ఎల్‌నినో ఎఫెక్ట్‌.!

ఇప్పటి వరకూ రైతులను వెంటాడిన ఎల్‌నినో కష్టాలు ఇప్పుడు దేవుడి వరకూ చేరాయి. వానలు లేక చెరువులు ఎండిపోవడంతో వినాయక నిమజ్జనాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు భక్తులు.

Post Published By: dialnews
Updated : 19 September 2026, 6:35 PM IST

ఇప్పటి వరకూ రైతులను వెంటాడిన ఎల్‌నినో కష్టాలు ఇప్పుడు దేవుడి వరకూ చేరాయి. వానలు లేక చెరువులు ఎండిపోవడంతో వినాయక నిమజ్జనాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఎండిపోయిన చెరువులు కుంటల్లోనే విగ్రహాలను వదిలేస్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం మీదుగా వెళ్తున్న HLC లో ఈ సారి నీటి జాడ కరువైంది. దీంతో రైతులు, ప్రజలు.. సాగు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే వినాయక చవితి రావడంతో లంబోదరుడి విగ్రహాల నిమజ్జనానికి కూడా నీరు కరువయ్యింది. దీంతో చేసేదిలేక వెంకటాపురం దయ్యాల కుంటపల్లికి చెందిన ప్రజలు ఎండిన కాలువలోనే వినాయకులను వదిలేసి వచ్చారు. మరోవైపు ఎల్లనూరు మండలం చిత్రావతిలోను నీళ్లు లేకపోవడంతో చెరువులోనే వినాయక ప్రతిమలను వదిలివేసి వెళ్లారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాన్ని చాలా ప్రాంతాల్లో ఇదే సీన్‌ కనిపిస్తోంది. ప్రతీ ఏటా ఎంతో కోలాహలంగా జరిగే వినాయక నిమజ్జనాల కార్యక్రమం ఈ ఏడు మాత్రం వర్షాలు లేకపోవడంతో వెలవెలబోతోంది.

 

Published : 
  • 19 September 2026, 6:35 PM IST