సోషల్ మీడియాలో రీల్స్, లవ్లీ పోస్ట్‌లు చూసి మురిసిపోయే కాలం ఇది. కానీ, ఆ ప్రేమ వెనుక ఎంతటి కిరాతక ప్లాన్ దాగి ఉందో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. పూణేలోని లోహగఢ్ కోట దగ్గర ఒక ధనిక వ్యాపారవేత్త కొడుకు కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ, పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్‌లో అది ప్రమాదం కాదు.. సొంత కాబోయే భార్య 'సియా గోయల్' తన ప్రియుడు 'చేతన్ చౌదరి'తో కలిసి చేసిన పక్కా ప్లాన్ మర్డర్ అని తేలింది. అస్సలు ఎందుకు చంపారు..? ఈ లవ్ స్టోరీ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి..?
ఈ కేసులో మహారాష్ట్ర పోలీసుల విచారణలో ఇప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్, సియా గోయల్‌ల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. కానీ, ఈ ఎంగేజ్‌మెంట్‌కు కేవలం కొన్ని వారాల ముందే సియా గోయల్ తన సీక్రెట్ లవర్ చేతన్ చౌదరితో కలిసి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్ళింది. ఒక ఫ్రెండ్స్ గ్రూప్‌తో కలిసి వెళ్ళినట్లు కలరింగ్ ఇచ్చినప్పటికీ, అక్కడ వీరిద్దరూ చాలా రోజులు ఏకాంతంగా గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడే కేతన్‌ను ఎలా వదిలించుకోవాలనే ప్లాన్‌కు పునాది పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల విచారణలో సియా చెప్పిన సమాధానాలు విని అధికారులే షాక్ అయ్యారు. అసలు తనకు కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. కానీ పెళ్లి వద్దని చెబితే కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని భయపడింది. అందుకే కేతన్‌ను చంపేస్తే.. కనీసం ఒక మూడు సంవత్సరాల పాటు తనకు పెళ్లి గోల ఉండదని, ఆ తర్వాత నిమ్మలంగా తన లవర్ చేతన్‌ను పెళ్లి చేసుకోవచ్చని ఒక వింత ప్లాన్ వేసింది. అంతేకాదు, పెళ్లి షాపింగ్ పేరు చెప్పి అమాయకుడైన కేతన్ నుంచి ఏకంగా ఒక కోటి రూపాయలు వసూలు చేసింది సియా. ఆ డబ్బును నేరుగా తన ప్రియుడు చేతన్‌కు ఇచ్చింది.
ఆ డబ్బుతో చేతన్ బిజినెస్ సెటిల్ చేసుకుని, ఒక 3 ఏళ్ల తర్వాత వచ్చి సియా పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనేది వీరి స్కెచ్. జూన్ 18న ప్లాన్ ప్రకారం కేతన్‌ను లోహగఢ్ కోటకు ట్రాప్ చేసి తీసుకెళ్లింది సియా. వీరిని ఫాలో అవుతూ ప్రియుడు చేతన్ కూడా వచ్చాడు. ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్ళగానే సియా సైగ చేయడంతో.. చేతన్ ఒక్కసారిగా కేతన్‌ను లోతైన లోయలోకి తోసేశాడు.పోలీసులకు దొరకకుండా ఉండటానికి చేతన్ తన ఫోన్‌ను షాపులోనే వదిలేసి, ఒక ఎంప్లాయ్ ఫోన్ వాడుతూ, తలకు హుడీ క్యాప్ పెట్టుకుని మరీ ఈ క్రైమ్ చేశాడు.
మొదట్లో ఇది కేవలం ఒక ప్రమాదం అని నమ్మించ చూశారు. కానీ, కేతన్ సోదరికి సియా ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆ తర్వాత కేతన్ తండ్రి, బంధువులు జూన్ 21న ఆ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి.. అది ప్రమాదవశాత్తు జారే అవకాశం లేదని, పక్కా మర్డర్ అని పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. మూడు సంవత్సరాల ఫ్రీడమ్ కోసం, ఒక కోటి రూపాయల డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ కిరాతక ప్రేమికులు ఇప్పుడు జైలు పాలయ్యారు. చూశారుగా ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో కనిపించే హ్యాపీ రీల్స్ వెనుక ఎలాంటి డార్క్ సీక్రెట్స్ ఉంటాయో.