బుల్లితెరపై తన గ్లామర్, చలాకీ తనంతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచే యాంకర్ రష్మి గౌతమ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు. దాదాపు 13 ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో యాంకర్ సుమ తర్వాత ఒకే షోను ఇన్ని ఏళ్లపాటు ఏకధాటిగా, ఎలాంటి బోర్ కొట్టించకుండా లాంగ్ రన్లో హోస్ట్ చేసిన రికార్డు కేవలం రష్మికే దక్కుతుంది. ఇంతకాలం తన గ్లామర్, కెరీర్ విషయాలతోనే వార్తల్లో నిలిచిన ఈ జబర్దస్త్ బ్యూటీ.. మొదటిసారి తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుని అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. నిజానికి రష్మికి ఇంత సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రష్మి వాళ్ల అమ్మ మమతా గౌతమ్ ది ఒరిస్సా రాష్ట్రం కాగా, నాన్న రామ్ గౌతమ్ ది ఉత్తరప్రదేశ్. కానీ, రష్మి మాత్రం పుట్టి, పెరిగిందంతా మన విశాఖపట్నంలోనే. అయితే, తన చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో, తల్లి దగ్గరే ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే అసలు ట్విస్ట్ ఏంటంటే.. రష్మి ఫ్యామిలీలో అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులేనట. తాతలు, అమ్మమ్మలు, అన్నలు, అమ్మానాన్నలు.. ఇలా ఫ్యామిలీలో అందరూ కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్లుగా పనిచేసినవారే అని రష్మి స్వయంగా చెప్పింది. వాళ్లంతా చాలా కూల్‌గా, అఫీషియల్‌గా, ఎంతో క్లాసిక్‌గా, డిగ్నిటీగా ఉంటారట. కుటుంబం మొత్తం ఆ రేంజ్ క్లాస్ ఆఫీసర్లు అయితే.. తాను మాత్రం దారి తప్పి ఇలా గ్లామర్ ఫీల్డ్‌లోకి వచ్చానని సరదాగా చెప్పుకొచ్చింది రష్మి.
తన కుటుంబంలో ఏ ఒక్కరికీ ఇటు సినిమా రంగంతో గానీ, అటు టీవీ రంగంతో గానీ కనీస పరిచయం కూడా లేదట. అయినా సరే, ఎవరి సపోర్ట్ లేకుండా ధైర్యంగా అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ వస్తోంది. మొదట్లో 'యువ' అనే సీరియల్ తో తన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినా, ఆశించిన స్థాయిలో రష్మికి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుండగా.. అనుకోకుండా 'జబర్దస్త్' ఆఫర్ తలుపు తట్టింది. అక్కడి నుంచి ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలతో పాటు 'ఆహా' ఓటీటీలో టాప్ తెలుగు ఇన్ ఫ్లూయెన్సర్లను వెలికితీసే ఒక సరికొత్త ఎంటర్టైనింగ్ షో కూడా చేస్తోంది.మొత్తానికి ఆఫీసర్ల ఫ్యామిలీ నుంచి వచ్చి, ఒంటరి పోరాటంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి జర్నీ గ్రేట్ అంటున్నారు ఆమె అభిమానులు.