దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కేతన్ హత్య కేసులో రోజుకో సంచలన నిజం వెలుగులోకి వస్తోంది. కేతన్‌ను చంపేందుకు సియా, చేతన్ ఎలాంటి ప్లాన్స్ వేశారు అనే విషయాలు ఇప్పటికే అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ క్రమంలో.. నిందితుల నుంచి వచ్చిన మరో నిజం ఇప్పుడు సంచలనంగా మారింది. కేతన్‌ను చంపడానికి సియా, చేతన్ కలిసి 14 సార్లు రిహార్సల్స్ చేశారట. ఎలాగైనా ఈ సారి ప్లాన్ మిస్ అవ్వకుండా పక్కాగా వ్యూహం అమలు చేశామని విచారణలో ఒప్పుకున్నారు నిందితులు. వీళ్లిద్దరు అరెస్ట్ అయిన తరువాత ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
కేతన్‌ను చంపాలనే ప్లాన్ సియానే చేసిందని చేతన్.. కాదు చేతన్ చెబితేనే కేతన్‌ను చంపేశానంటూ సియా.. చాలా కబుర్లు చెప్పారు. కానీ ప్లాన్ ఎవరిదైనా ఇద్దరూ కలిసే మర్డర్ చేశారు కాబటి శిక్ష తప్పదు. ఈ కేసులో భాగంగా క్రైం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేందుకు సియాను, చేతన్‌ను పోలీసులు లోహగఢ్ ఫోర్ట్‌కు తీసుకువెళ్లారు. నిందితులిద్దరినీ వేరు వేరుగా ఫోర్టుకు తీసుకెళ్లి.. ఎక్కడ, ఎప్పుడు, ఏం జరిగింది.. ఎక్కడ కేతన్‌ను లోయలోకి తోసేశారు అనే విషయాలు రీక్రియేట్ చేశారు. కేతన్ ప్లేస్‌లో ఓ డమ్మీ బొమ్మను పెట్టి ఓ సారి సియాతో మరోసారి చేతన్‌తో సీన్ రీక్రియేట్ చేయించారు. ఈ క్రమంలోనే సియా, చేతన్ రిహార్సల్ విషయం బయటికి వచ్చింది.
కేతన్‌తో పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచే కేతన్‌ను చంపేదుకు సియా ప్లాన్ చేస్తోంది. డిసెంబర్లో లోహగఢ్ ఫోర్ట్‌కు వెళ్లినప్పుడు అదే లోయలో తోసి చంపేయాలని నిర్ణయించుకుంది. జూన్ 14న ఫొటో షూట్ పేరుతో కేతన్‌ను లోహగఢ్లోని స్పాట్‌కు తీసుకువెళ్లింది. అక్కడ పామును చూసి భయపడినట్టు యాక్టింగ్ చేసి.. కేతన్‌ను నెట్టే ప్రయత్నం చేసింది. కానీ అదృష్ణవశాత్తూ కేతన్ లోయలో పడిపోలేదు. దీంతో ఈ మర్డర్ చేయడానికి పక్కా ప్రాక్టీస్ అవసరమని భావించింది సియా.. సియా, చేతన్ కలిసి ఈ మర్డర్ ఎలా చేయాలో 14 సార్లు ప్రాక్టీస్ చేశారు. చివరకు జూన్ 18న కేతన్‌ను స్పాట్‌కు తీసుకువచ్చి చంపేశారు. పెళ్లి ఇష్టం లేని కారణంగా ఓ అమాయకున్ని ఇంత ప్లాన్ చేసి చంపిన సియా, చేతన్ క్రూరత్వం చూసి పోలీసులే షాకయ్యారు.