బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటారు. తాజాగా ఈ భామ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ భారతదేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని విచిత్రమైన సూచన చేశారు. అప్పుడే దేశంలో మహిళలపై జరిగే నేరాల రేటు తగ్గుతుందని ఆమె తనదైన శైలిలో వాదించారు. అంతేకాకుండా తన శృంగార వీడియోలు పురుషులు రిలాక్స్ కావడానికి సహాయపడుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ వీడియోలు మానవాళికి ఎంతో సేవ చేస్తున్నాయని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే పురుషుల ఆలోచన మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతుండగా, నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
పూనమ్ పాండే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు ఎందుకంటే ఆమె గతం నుంచి కూడా వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు.
గతంలో 2011 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా గెలిస్తే బట్టలు విప్పి తిరుగుతానంటూ ఆమె చేసిన ప్రకటన పెద్ద కలకలమే రేపింది. అలాగే క్యాన్సర్ అవేర్‌నెస్ పేరుతో తాను చనిపోయానని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముంబైలో మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి 'నషా' సినిమాతో హీరోయిన్‌గా మారిన ఆమె, 'మాలిని అండ్ కో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. వ్యక్తిగత జీవితంలో కూడా భర్తపై గృహహింస ఆరోపణలు చేయడం, రియాలిటీ షోలలో బోల్డ్‌గా మాట్లాడటం వంటివి చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.