Top story: సుశాంత్ , దిశా లను హత్య చేశారా? ఆరేళ్ల తర్వాత సంచలనం రేపుతున్న సుశాంత్, దిశా మరణం మిస్టరీ కేసు..!

సుశాంత్ సింగ్ రాజ్ పుట్ గుర్తున్నాడా? ధోని మూవీ హీరో. సుశాంత్ చనిపోయి ఆరేళ్ల తర్వాత ,మళ్లీ ఇప్పుడు అతని ఆత్మహత్య? హత్య వివాదం తెరపైకి కొచ్చింది. సుశాంత్ ని, అతని ఫిమేల్ మేనేజర్ దిసాని ఛానల్ లో ఒక కీలక నేత హత్య చేయించాడని, దిసాని ఆరుగురు దారుణంగా రేప్

Post Published By: dialnews
Updated : 11 September 2026, 5:02 PM IST

సుశాంత్ సింగ్ రాజ్ పుట్ గుర్తున్నాడా? ధోని మూవీ హీరో. సుశాంత్ చనిపోయి ఆరేళ్ల తర్వాత ,మళ్లీ ఇప్పుడు అతని ఆత్మహత్య? హత్య వివాదం తెరపైకి కొచ్చింది. సుశాంత్ ని, అతని ఫిమేల్ మేనేజర్ దిసాని ఛానల్ లో ఒక కీలక నేత హత్య చేయించాడని, దిసాని ఆరుగురు దారుణంగా రేప్ చేసి చంపేశారని.... ఈ రెండు మరణాల్ని ఆత్మహత్యలుగా మార్చేశారని.... అవన్నీ బయటకు రాకుండా పోలీసులు, శివసేన నాయకులు నిజాలను కప్పెట్టేసారని ఆరోపణలు మరోసారి తెర మీదకు వచ్చేయ్. ఈ కేసులో సిబిఐ మరోసారి దర్యాప్తు చేయాలని డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది
ఆరేళ్లయినా బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ డెత్‌ మిస్టరీ ఇంకా వీడలేదు. సుశాంత్ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన కొన్ని రోజులకే బీజేపీ ఎమ్మెల్యే నీరజ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తన సోదరుడు సుశాంత్‌ హత్యకు గురయ్యాడని, ఆయన మరణంపై పునర్విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్‌ 2020 జూన్‌లో చనిపోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హత్యకు గురయ్యారని ఆయన కజిన్‌ నీరజ్‌ సింగ్‌ ఆరోపించడంతో కలకలం రేగింది. నీరజ్‌ సింగ్‌ సాదా సీదా వ్యక్తి కాదు. బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్యే. తన కజిన్‌ సుశాంత్, అతని మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ ...ఇద్దరూ హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఈ కేసును తక్షణమే తిరిగి తెరవాలని, పునర్విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సుశాంత్‌ చనిపోయిన వెంటనే అతని శవం చుట్టూ పోలీసులు విధించిన అధిక ఆంక్షలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే నీరజ్‌ సింగ్‌ ఆరోపించారు. పోలీస్‌ అధికారులు ఏదో దాస్తున్నారని విషయాన్ని ఆంక్షలు ధ్రువీకరిస్తున్నాయని అన్నారు. దిశా సాలియన్ మరణ కేసును పరిష్కరిస్తే సుశాంత్ హత్యకు గురయ్యాడని రుజువవుతుందని తమ కుటుంబం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ ని కోరారు.

జూన్‌ 8న దిశా సాలియన్‌ ముంబైలో 14వ అంతస్తు నుంచి కింద పడి మరణిస్తే, ఆ తర్వాత కొన్ని రోజులకే అంటే అదే నెల 14న సుశాంత్‌ బాంద్రాలోని తన నివాసంలో మరణించాడు. ఆరేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నానంటూ ఇటీవల దిశా తండ్రి సతీశ్‌ సాలియన్‌ తీవ్ర భావోద్వేగం చెందారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై వారం క్రితం విచారణ జరిపిన బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దిశా కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.మరోవైపు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నీరజ్ కుమార్‌ సింగ్. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతోనే సూశాంత్‌ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడన్న సంజయ్‌ రౌత్‌ చేసిన ఆరోపణలను ఖండించారు. సంజయ్‌ రౌత్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.దిశా ,సుశాంత్ ఇద్దరి మరణాలకు లింక్ ఉంది. అసలు వీళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. అందుకు సరైన కారణము దొరకడం లేదు. మేనేజర్ దిసాని శివసేన అగ్ర నేత అతని స్నేహితులు రేప్ చేసి చంపేశారని, ఆ విషయాన్ని బయటపెడతాడని భయంతో సుశాంత్ కూడా హత్య చేశారని వదంతులకు ఇప్పటికీ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆరేళ్ల తర్వాత అయినా సిబిఐ నిజం బయటపడుతుందా.... రాజకీయ కారణాలతో వాటిని కప్పిడుతుందా అన్నది చూడాలి.

 

 

Published : 
  • 11 September 2026, 5:02 PM IST