Urvashi Rautela: పవన్‌కే ఓటేస్తానంటున్న ఊర్వశి రౌతేలా

రీసెంట్‌గానే పవన్‌ సీఎం అంటూ ఓ ట్వీట్‌ చేసి అందరికీ షాకిచ్చింది ఊర్వశి. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా వచ్చిన బ్రో సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పవన్‌తో స్టేజ్‌ మీద ఉన్న ఫొటోను ఊర్వశి ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి పవన్‌తో స్టేజ్‌ పంచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 31 July 2023, 10:38 AM IST

Urvashi Rautela: హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి పవన్‌ కళ్యాణ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. జగన్‌, పవన్‌ ఇద్దరిలో తాను పవన్‌ కళ్యాన్‌కే ఓటు వేస్తానంటూ చెప్పింది. రీసెంట్‌గా ట్విటర్‌లో #Askurvashi పేరుతో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేసింది ఊర్వశి. ఈ చిట్‌చాట్‌లో ఓ ఫ్యాన్ జగన్‌, పవన్‌ గురించి ఊర్వశిని అడిగాడు. జగన్‌, పవన్‌ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తావంటూ అడిగాడు. దీనికి సమాధానంగా ఊర్వశి తాను పవన్‌కే ఓటు వేస్తానంటూ చెప్పింది.

దీంతో ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. రీసెంట్‌గానే పవన్‌ సీఎం అంటూ ఓ ట్వీట్‌ చేసి అందరికీ షాకిచ్చింది ఊర్వశి. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా వచ్చిన బ్రో సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పవన్‌తో స్టేజ్‌ మీద ఉన్న ఫొటోను ఊర్వశి ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి పవన్‌తో స్టేజ్‌ పంచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చింది. అప్పుడు కూడా ఊర్వశి చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఎన్నికలు జరగకుండానే పవన్‌ను ఊర్వశి సీఎంను చేసిందంటూ ఫ్యాన్స్‌ ఫన్నీగా కామెంట్లు పెట్టారు. పవన్‌ కనిపించగానే ఆయన ఫ్యాన్స్‌ అంతా సీఎం సీఎం అని అరుస్తుంటారు. ఈ అరుపులు విని నిజంగానే పవన్‌ సీఎం అని ఊర్వశి కన్ఫ్యూజ్‌ అయ్యి ఉంటుందని కొందరన్నారు.

ఇప్పుడు జగన్‌, పవన్‌ ఇద్దరిలో పవన్‌కే మద్ధతిస్తానని ఊర్వశి చెప్పడంతో.. ఆమె ఇంతకుముందు చేసిన ట్వీట్‌ కూడా కావాలనే చేసింది అంటున్నారు ఫ్యాన్స్‌. ఊర్వశిలాగే అంతా పవన్‌కు సపోర్ట్‌ చేసి ఆయనను సీఎం చేయాలని కోరుతున్నారు.

 

Published : 
  • 31 July 2023, 10:38 AM IST