Pradhan Mantri has set up Bharatiya Jan Aushadhi Kendras at railway stations
సాధారణంగా ఎవరైనా ప్రయాణం చేయాలంటే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మెడిసిన్ కిట్ ను ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఎంత ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకం మందులు మరిచిపోతూ ఉంటాం. దీనికి కారణం ప్రయాణ హడావిడి అని చెప్పాలి. మరి కొందరైతే తెచ్చుకున్న మందులు అయిపోయి, స్టేషన్ బయట కొనాలంటే రైలు ఎక్కడ వెళ్లి పోతుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వారికోసం భారతీయ రైల్వే సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. దీంతో ప్రయాణాల్లో మెడిసిన్ ఇబ్బందులను అధిగమించవచ్చు అని చెబుతున్నారు రైల్వే అధికారులు.
ముందుగా ఈ కేంద్రాలను 50 ప్రదాన రైల్వే స్టేషన్లలో అందుబాలోకి తెచ్చారు. ఇక్కడ విజయవంతం అయితే క్రమక్రమంగా అన్ని ప్రదాన రైల్వే స్టేషన్లలో ఏర్పటు చేసేందుకు కార్యాచరణ రూపొందించటనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో, తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తూ ఉంటుంది కనుక ఇక్కడ మందులు ఎలాంటి కల్తీ లేకుండా విక్రయాలు జరుగుతాయి. పైగా తక్కువ ధరకే లభిస్తాయి. ఎమ్మార్పీ పై చాలా వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
T.V.SRIKAR