Ishan Kishan: ఇషాన్ రెచ్చిపోతే ఇలాగే ఉంటుంది.. గర్ల్ ఫ్రెండ్ హాట్ కామెంట్స్..

ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై అతడి గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా అభిమానం చాటుకుంది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 4 September 2023, 4:50 PM IST

Ishan Kishan: ఆసియా కప్ 2023 లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన పోరులో భారత్ ఒక దశలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కీలక ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరుకున్నారు. ఈ దశలో భారత్ 150 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు.

అయితే యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు అద్భుతంగా పోరాడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ పాకిస్తాన్ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు. 81 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై అతడి గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా అభిమానం చాటుకుంది.

తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్‌పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.

Published : 
  • 4 September 2023, 4:50 PM IST