భారత్ - న్యూజిలాండ్ మధ్య తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఓ విషయం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా వికెట్ కీపింగ్ చేసే సంజూ శాంసన్ స్థానంలో ఈసారి ఇషాన్ కిషన్ గ్లోవ్స్ వేసుకొని మైదానంలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో సంజూనే కీపర్‌గా కొనసాగాడు. అయితే ఐదో మ్యాచ్‌లో అకస్మాత్తుగా ఇషాన్ కీపింగ్ చేయడం చూసి, సంజూ ఫామ్‌పై ప్రభావమా... టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయమా అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కివీస్ తో సిరీస్ తర్వాత టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు విఫలమవడంతో ఓపెనర్‌గా సంజూ శాంసన్ కథ ముగిసినట్టే కనిపిస్తోంది. మరోవైపు విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లొ టీమిండియా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు.
తిరువనంతపురం టీ20కి ముందే టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం చెలరేగాడు. దాంతో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్.. ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్‌కు ప్రమోషన్‌గా వికెట్ కీపింగ్ చేసే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే సంజూను తప్పించి ఇషాన్ చేత కీపింగ్ చేయించడంపై మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసినదేనని సూర్య చెప్పాడు.
సిరీస్ ప్రారంభమయ్యే ముందే నిర్ణయం తీసుకున్నామనీ,. సంజూ మూడు మ్యాచ్‌లు, ఇషాన్ రెండు మ్యాచ్‌ల్లో కీపింగ్ చేయాలని ఫిక్స్ చేశామన్నాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరినీ ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంచామని చెప్పుకొచ్చాడు.దీని ప్రకారం చూస్తే తిలక్ వర్మ ఎంట్రీతో సంజూపైనే వేటు పడుతుందని భావిస్తున్నారు.ఇషాన్ గత మ్యాచ్‌లో స్వల్ప గాయంతో ఆడలేకపోయాడు. దాంతో ఈ మ్యాచ్‌లో అతను ఆడటంపై కూడా సందేహాలు వచ్చాయి. కానీ తిరువనంతపురంలో అద్భుతంగా కమ్ బ్యాక్ ఇచ్చి సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించి జట్టును భారీ స్కోర్‌కు తీసుకెళ్లాడు. భారత్ మొత్తం 272 పరుగులు చేసింది.