Know information about WhatsApp tick mark to avoid cyber crimes
వాట్సప్ అనగానే ఒకరికొకరు పరస్పరం సందేశంతో పాటూ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలను పంపించుకునే గొప్ప సామాజిక మధ్యమం. దీనిని కొన్ని కోట్లమంది వినియోగిస్తున్నారు. అయితే తాజాగా 74లక్షల వాట్సప్ ఖాతాలు బ్లాక్ చేసినట్లు తెలిపింది మెటా సంస్థ. దీనికి కారణాలు కూడా వెలువరించింది. ఐటీ నిబంధనలకు విరుద్దంగా అసభ్య, అభ్యంతరకర సందేశాలు పంపించే వారిని గుర్తించింది. వీరి అకౌంట్లను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది ఈ దిగ్గజ చాటింగ్ యాప్ సంస్థ.
వాట్సప్ గురించి మరిన్ని విషయాలు..
వాట్సప్ ప్రత్యేక సమాచారం..
వాట్సప్ వేదికగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ వ్యక్తిగత వివరాలతోపాటూ బ్యాంకుకు సంబంధించిన వివరాలను లూటీ చేస్తున్నారు. డబ్బులు కాజేసేందుకు మీకు కొన్ని లింకులను పంపిస్తున్నారు. వీటిని ఓపెన్ చేయడం వల్ల మీ పూర్తి వివరాలను తమ ఆధీనంలోకి తీసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ కష్టపడకుండా హాయిగా ఒక చోట కూర్చొని డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. అందుకే ఈ కింది సూచనలు పాటిస్తే అతి సులువుగా వీరి బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
T.V.SRIKAR