Ravi Teja, Eagle, Trailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఆ తర్వాత రావణాసుర, అలాగే దసరాకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఇదే జోష్‌లో వచ్చే సంక్రాంతికి ఈగల్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 December 2023, 11:23 AM IST

 

పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఆ తర్వాత రావణాసుర, అలాగే దసరాకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఇదే జోష్‌లో వచ్చే సంక్రాంతికి ఈగల్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా కావ్య థాపర్ మరో కీలక పాత్రల్లో నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈగల్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అలాగే.. ఈగల్ ఊర మాస్ అంథమ్ ఆడు మచ్చా పాట కూడా చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈగల్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈగల్ థియేట్రికల్ ట్రైలర్‌ని డిసెంబర్ 20న సాయంత్రం 4 గంటల 5 నిమిషాల విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్‌లో రవితేజ మాస్ లుక్‌లో పెద్ద మిషన్ గన్‌ ఫైర్ చేస్తు కనిపిస్తున్నాడు.

దీంతో ట్రైలర్ కోసం మాస్ రాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ మహారాజా మంచి పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో పది సినిమాల వరకు లైన్ లో ఉన్నాయి. మరి గట్టి పోటి మధ్య బరిలోకి దిగుతున్నాడు మాసోడు. మరి ఈ సినిమాతో రవితేజ సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తాడా లేదా అనేది చూడాలి.

Published : 
  • 20 December 2023, 11:23 AM IST