Actress: బికినీ వేస్తే తోలుతీస్తాం.. నయనతారకు వార్నింగ్స్..

నయనతార నిన్న గా మొన్న పెళ్లైంది. సరోగసీతో తల్లైంది. ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తోజోడీ కట్టి జవాన్ మూవీ చేస్తోంది. అంత బానే ఉంది కానీ, ఇప్పుడు తను బికినీ వేస్తే తోలుతీస్తామంటూ సోషల్ మీడియాలో కామెంట్ల దాడి పెరుగుతోందట.

Post Published By: Srikar Creator
Updated : 25 March 2023, 10:15 PM IST

తమిళ్ డైరెక్టర్ ఆట్లీ మేకింగ్ లో రాజా రానీ, విజిల్ మూవీస్ చేసిన నయనతార, ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా చేస్తుందనగానే, అందులో నయన తార బికినీ వేస్తుందనే ప్రచారం పెరిగింది.
అంతే పఠాన్ లో దీపికా పదుకొనే చేసిన తప్పే నయన చేస్తోందా అంటూ నెటీజన్స్ లో ఆగ్రహం షురూ అయ్యింది

నయనతార గతంలో బిల్లా తమిళ వర్షన్ లో స్విమ్ సూట్ వేసింది. కానీ ఇంతవరకు బికీనీ వేయలేదు. అలాంటి తను పెళ్లయ్యాక ఇప్పుడు జవాన్ మూవీలో బికీనీ వేస్తుందనే ప్రచారం ఊపందుకోవటంతో, తన ఫ్యాన్సే కాదు షారుఖ్ యాంటీ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. పఠాన్ లో ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా దీపికా వేసిన డ్రెస్ ఎలా వివాదం అయ్యిందో, అదే నయనతార విషయంలో జరిగేలా ఉందనంటున్నారు. కాని ఎక్కడ కూడా నయనతార బికినీ లేదంటే స్విమ్ సూట్ వేస్తుందని, వేసిందని వార్తలు రాలేదు. కేవలం రూమర్స్ నిబేస్ చేసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెంచటంతో, జవాన్ టీం ముఖ్యంగా నయనతార షాక్ అవుతోందట.

Published : 
  • 25 March 2023, 10:15 PM IST