Poonam Kaur: జగన్‌కు పూనం కౌర్‌ ప్రశంసలు.. సీఎం జగన్‌ను ఆకాశానికెత్తిన పూనం కౌర్‌

చాలా కాలం నుంచి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై పూనం కౌర్‌ ఇండైరెక్ట్‌గా మాటల యుద్ధం చేస్తూనే ఉంది. సమయం దొరికిన ప్రతీసారి పవర్‌స్టార్‌ పరువు తీస్తూనే ఉంది. ఇదే క్రమంలో పవన్‌కు ఎప్పుడు వెన్నంటే ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా టార్గెట్‌ చేస్తూ చాలా పోస్ట్‌లు చేసింది పూనం.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 2:12 PM IST

Poonam Kaur: హీరోయిన్‌ పూనం కౌర్‌.. ఏపీ సీఎం జగన్‌ను ఆకాశానికెత్తారు. సీఎం సార్‌ సూపర్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కోవిడ్‌ సమయంలో చేనేత కార్మికులకు సీఎం చేసిన సహాయం చరిత్రలో నిలిచిపోతుందంటూ చెప్పారు. కష్ట సమయంలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందంటూ చెప్పారు. చేనేత కార్మికుల కోసం పని చేసే కార్యకర్తగా ఈ విషయం తనకు ఎంతో సంతృప్తినిచ్చిదంటూ చెప్పారు పూనం కౌర్‌.

Chinmayi Sripada: భారత్‌లోనే ఇలా? మరో వివాదంలో సింగర్ చిన్మయి

అయితే ఇక్కడ వైసీపీ చేసిన పని హైలెట్‌ కాదు. జగన్‌ గురించి పూనం ట్వీట్‌ చేయడం ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌గా మారింది. చాలా కాలం నుంచి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై పూనం కౌర్‌ ఇండైరెక్ట్‌గా మాటల యుద్ధం చేస్తూనే ఉంది. సమయం దొరికిన ప్రతీసారి పవర్‌స్టార్‌ పరువు తీస్తూనే ఉంది. ఇదే క్రమంలో పవన్‌కు ఎప్పుడు వెన్నంటే ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా టార్గెట్‌ చేస్తూ చాలా పోస్ట్‌లు చేసింది పూనం. దీంతో జగన్‌ను సపోర్ట్ చేసే చాలా మంది చాలా కాలంగా సోషల్ మీడియాలో పూనంను సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు.

అలాంటి పూనం ఇప్పుడు జగన్‌కు మద్దతుగా పోస్ట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. అందులోనూ ఇది ఎన్నికల టైం కావడం ఇప్పుడ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ పోస్ట్‌ను బేస్‌ చేసేకుని వైసీపీ నేతలు మరోసారి పవన్‌ను టార్గెట్‌ చేసే అవకాశం ఉండే ఛాన్స్‌ ఉంది.

Published : 
  • 6 March 2024, 2:12 PM IST