Kohli Vs Sanju : కోహ్లీ, సంజూ మధ్య నువ్వా నేనా ?

ఐపీఎల్ 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో పలు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నడుస్తోంది. అటు ఆరెంజ్ క్యాప్ రేసు కూడా రసవత్తరంగా మారింది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లియే 542 పరుగులతో టాప్ లో ఉన్నాడు. అతడు 11 మ్యాచ్ లు ఆడేశాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 May 2024, 4:15 PM IST

 

 

ఐపీఎల్ 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో పలు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నడుస్తోంది. అటు ఆరెంజ్ క్యాప్ రేసు కూడా రసవత్తరంగా మారింది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లియే 542 పరుగులతో టాప్ లో ఉన్నాడు. అతడు 11 మ్యాచ్ లు ఆడేశాడు. ఇక తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 541 పరుగులతో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో శాంసన్ 46 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్ లతో 86 రన్స్ చేశాడు. తన టీమ్ ను గెలిపించలేకపోయినా ఆరెంజ్ క్యాప్ రేసులో ముందడుగు వేశాడు.కోహ్లి కంటే కేవలం ఒక్క పరుగు వెనుకే ఉన్నాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ వెనుకబడటం, రాయల్స్, సీఎస్కేలకు అవకాశం ఉండటంతో కోహ్లిని వెనక్కి నెట్టి రుతురాజ్, సంజూ శాంసన్ రేసులో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇక 461 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ సునీల్ నరైన్ నాలుగో స్థానంలో ,సన్ రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 444 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

Published : 
  • 8 May 2024, 4:15 PM IST