ఇకపై మరింత భారీగా ఐపీఎల్ హింట్ ఇచ్చిన జైషా

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఐపీఎల్ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. 17 ఏళ్ళ కాలంలో జట్ల సంఖ్య పెరగడంతో పాటు లీగ్ లో మ్యాచ్ లూ పెరిగాయి. ప్రస్తుతం 10 జట్ల మధ్య ఐపీఎల్ సమరం రసవత్తరంగా మారిపోయింది. అయితే వచ్చే సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొదట్లో 60 మ్యాచ్ లతో షెడ్యూల్ రూపొందితే.. ప్రస్తుతం 74 మ్యాచ్ […]

Post Published By: Vencateshg
Updated : 16 August 2024, 7:39 PM IST

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఐపీఎల్ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. 17 ఏళ్ళ కాలంలో జట్ల సంఖ్య పెరగడంతో పాటు లీగ్ లో మ్యాచ్ లూ పెరిగాయి. ప్రస్తుతం 10 జట్ల మధ్య ఐపీఎల్ సమరం రసవత్తరంగా మారిపోయింది. అయితే వచ్చే సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొదట్లో 60 మ్యాచ్ లతో షెడ్యూల్ రూపొందితే.. ప్రస్తుతం 74 మ్యాచ్ లకు చేరింది. ఇకపై వీటి సంఖ్య 84కు పెరుగుతుందని సమాచారం. ఈ ప్రపోజల్ పై బీసీసీఐ చర్చించినట్టు కూడా జైషా చెప్పారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అయితే ఆటగాళ్ళపై పని ఒత్తిడి, అంతర్జాతీయ సిరీస్ ల షెడ్యూల్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

Published : 
  • 16 August 2024, 7:39 PM IST

Topics :