విరాళాల విభీషణుడు వివేక్ ఒబెరాయ్.!

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ'. బాలీవుడ్ తో పాటు భారతీయ చిత్రసీమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ విజ్యువల్ వండర్ పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 3 August 2026, 8:00 PM IST

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ'. బాలీవుడ్ తో పాటు భారతీయ చిత్రసీమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ విజ్యువల్ వండర్ పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ విజువల్ వండర్‌లో నటించే నటీనటులకు కూడా భారీ ఎత్తున రెమ్యునరేషన్లు ఇస్తున్నారనేది విశ్లేషకుల మాట. అయితే, అందరూ కోట్ల రూపాయల పారితోషికాన్ని ఆస్వాదిస్తుంటే, ఒక నటుడు మాత్రం తనకు రాబోయే భారీ రెమ్యునరేషన్‌ను ఏమాత్రం ఆలోచించకుండా వదులుకోవడమే కాకుండా, ఒక గొప్ప సామాజిక కార్యక్రమానికి ధారాదత్తం చేసి వార్తల్లో నిలిచారు.

అతడే బాలీవుడ్ వర్సటైల్ నటుడు వివేక్ ఒబెరాయ్.ఈ భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ'లో వివేక్ ఒబెరాయ్ 'విభీషణ' పాత్రను పోషిస్తున్నారు. విభీషణుడి పాత్ర భారతీయ ఇతిహాసాలలో చాలా ప్రత్యేకమైనది మరియు సవాలుతో కూడుకున్నది. అధర్మం వైపు కాకుండా ధర్మం వైపు నిలబడటానికి తన స్వంత రక్తాన్ని, కుటుంబాన్ని కూడా వ్యతిరేకించిన మహోన్నతమైన పాత్ర అది.ఇటువంటి శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నందుకు లభించే భారీ పారితోషికాన్ని తన సొంతానికి వాడుకోకూడదని వివేక్ నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ద్వారా తనకు రావాల్సిన పూర్తి రెమ్యునరేషన్‌ను క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల వైద్య చికిత్సల కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు వివేక్ ఒబెరాయ్ ప్రకటించారు.

ఈ విషయాన్ని వివేక్ ఒబెరాయ్ అకస్మాత్తుగా చెప్పలేదు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా దృష్టికి ముందుగానే తీసుకెళ్లారు. తను ఈ సినిమాలో నటించడానికి అంగీకరించే ముందే, తన పారితోషికాన్ని నేరుగా క్యాన్సర్ చికిత్స పొందుతున్న పేద పిల్లల ట్రస్ట్‌కు లేదా వారి వైద్య ఖర్చులకు చేరేలా ఏర్పాటు చేయాలని కోరారు. వివేక్ చూపిన ఈ ఉదారతకు మరియు సామాజిక స్పృహకు నిర్మాత నమిత్ మల్హోత్రా కూడా ఎంతో ఆశ్చర్యపోయి, ఆయన నిర్ణయాన్ని మనస్పూర్తిగా అభినందించారు. వివేక్ ఒబెరాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఉదార మనస్సుకు నీరాజనాలు పడుతున్నారు.

Published : 
  • 3 August 2026, 8:00 PM IST