రోహిత్ వర్సెస్ రుతురాజ్ ఆసీస్ గడ్డపై ఫైట్

ఆస్ట్రేలియా టూర్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

Post Published By: Vencateshg
Updated : 29 October 2024, 12:41 PM IST

ఆస్ట్రేలియా టూర్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. దీని కోసం పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతోంది. ఆసీస్ గడ్డపై పరిస్థితులకు అలవాటు పడేందుకు వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడనుంది. రోహిత్ శర్మ సారధ్యంలోని భారత క్రికెట్ జట్టు.. ఇండియా ఏ తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో తలపడనుంది. పెర్త్ వేదికగా నవంబర్ 15 నుండి 17 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. భారత ఏ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నాడు. భారత్ ఎ జట్టులోనే అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, దేవదూత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ జట్టులో కొందరిని ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కోసం రిజర్వ్ ప్లేయర్స్ గానూ ఎంపిక చేశారు.

Published : 
  • 29 October 2024, 12:41 PM IST