కడప బోర్డర్ లో జేసి ప్రభాకర్ రెడ్డి, అలెర్ట్ అయిన పోలీసులు

అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి... జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లైయాష్ రగడ తీవ్ర దుమారం రేపుతోంది. అప్రమత్తమైన అనంతపురం, కడప జిల్లాల పోలీసులు... ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Post Published By: Vencateshg
Updated : 27 November 2024, 3:34 PM IST

అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి... జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లైయాష్ రగడ తీవ్ర దుమారం రేపుతోంది. అప్రమత్తమైన అనంతపురం, కడప జిల్లాల పోలీసులు... ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాళ జమ్మలమడుగులోని ఆర్టిపిపి వద్దకు వెళతానని ప్రకటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి... తమ లారీలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామం దగ్గర రోడ్డుపై భారీగా మోహరించిన పోలీసులు... ఇరు వర్గాలను కట్టడి చేస్తున్నారు. అనంతపురం, కడప బార్డర్ సుగుమంచిపల్లె వద్ద పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఏ విధమైన ఘటనలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి నుంచి జెసి ప్రభాకర్ రెడ్డి జమ్మలమడుగు వెళతారన్న సమాచారంతో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. జెసి ప్రభాకర్ రెడ్డిని కడప జిల్లా బార్డర్ వద్దే అడ్డుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు.

Published : 
  • 27 November 2024, 3:34 PM IST