Tollywood: పవర్ స్టార్ నుంచే.. రౌడీ స్టార్ కాపీ కొడుతున్నాడా..?

పవన్ కళ్యాణ్ హిట్ మూవీ ఖుషీకి, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఖుషీకి ఈ మధ్యపోలికలు పెడుతున్నారు. అసలు ఎందుకు రౌడీ స్టార్ మూవీకి ఖుసీ అని టైటిల్ పెట్టారనే డౌటు, ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మెదల్లను తొలుస్తోంది. ఐతే దర్శకుడు ఇచ్చిన బోరింగ్ ఆన్సర్ ఎవరికీ నచ్చకపోగా రివర్స్ లో పంచ్ లు వేస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 10 April 2023, 6:15 PM IST

పవన్ హిట్ట మూవీ ఖుషీ ఫీల్ ఉన్న సినిమా కాబట్టి, విజయ్ ఖుషీ కూడా అలాంటి సినిమానే అని సేమ్ టైటిల్ వాడామన్నారు. ఐతే గతంలో విజయ్ తనకు పవర్ స్టార్ బిరుదు సూట్ అవుతుందని సరదాగాఅన్నడైలాగ్ ని, ఇప్పుడు తన సినిమా టైటిల్ ని కలిపి ట్రోల్ చేస్తున్నారట. యూత్ ని ఆకట్టుకోవటంతో, పవన్ని కాపీ కొడుతున్న రౌడీ అంటూ ఇదో కొత్త వాదన మొదలైంది

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే పవన్ ఖుసీలో ఓ సీన్ ని విజయ్ ఖుషీ టీం వాడిందట. ఖుసీలో హీరో హీరోయిన్లు ఇద్దరు ఒకేసారి పుడితే, విజయ్ ఖుషీలో మాత్రం హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకేసారి చనిపోతారట. అలా వాళ్లు చనిపోయిన క్లైమాక్స్ సీన్ తో మూవీ కథ మొదలై, వాళ్లు ప్రేమలో పడే సీన్ తో సినిమా ఎండ్ అవుతుందని, ఇలా రివర్స్ స్టోరీ ఓకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇదే ఖుషీ కధా లేదంటే పుకారో టీం రెస్పాండ్ అవుతేనో, లేదంటే ట్రైలర్ వస్తేనో తెలుస్తుంది.

Published : 
  • 10 April 2023, 6:15 PM IST