పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను నెటిజన్లు టార్గెట్ చేశారు. అతను బౌలింగ్‌కి వచ్చినప్పుడు యూఎస్ఏ బ్యాటర్లు కూడా నవ్వుకుంటూనే ఆడటం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత ఉస్మాన్ తారిక్‌ను ట్రోల్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.పాకిస్తాన్ స్పిన్ బౌలర్ ఉఇదేం బౌలింగ్ యాక్షన్ ? పాక్ స్పిన్నర్ ను ఆడుతుంటున్న ఫ్యాన్స్...!స్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ మరోసారి విమర్శలకు తావిచ్చింది. బౌలింగ్ చేసే సమయంలో ఆగి ఆగి ఒక్కసారిగా విసిరేస్తుండటంతో అసలు ఇది బౌలింగ్ ఎలా అవుతుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఉస్మాన్ బౌలింగ్ చేస్తుండగా.. మరోవైపు యూఎస్ఏ, శ్రీలంక ఫ్యాన్స్ ఆ బౌలింగ్ యాక్షన్‌ని కాపీ చేస్తూ.. ఇదేంటి ఇలా విసిరేస్తున్నాడు అంటూ యాక్షన్ చేసి చూయించారు.
బౌలింగ్ చేసే సమయంలో అతను చేతిని ఆపి మరి బౌలింగ్ చేస్తున్నాడని, ఈ బౌలింగ్‌ను ఎలా అనుమతించారని ఐసీసీని నిలదీస్తున్నారు. అతని బౌలింగ్ గల్లీ క్రికెటర్ బౌలర్‌ను తలపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ ఏకంగా గ్రౌండ్‌లో త్రో వేస్తున్నాడు అంటూ చెప్పడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఉస్మాన్ బౌలింగ్‌లో అవుటైన తర్వాత పెవిలియన్‌కు వస్తూ కామెరూన్ గ్రీన్ అంపైర్‌కి కంప్లెయింట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ రూల్స్‌కు తగ్గట్టే తాను బౌలింగ్ చేస్తున్నానంటూ ఉస్మాన్ తర్వాత చెప్పుకొచ్చాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా యూఎస్ఏ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఉస్మాన్ 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 190/9 పరుగులు చేయగా, యూఎస్ఏ 159/8 పరుగులే చేయగలిగింది. దాంతో పాక్ 32 పరుగుల తేడాతో విజయం సాధించగలిగింది. పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో విజయం సాధించడం విశేషం. యూఎస్ఏ తన తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఓటమిపాలయింది. ఇక రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది.