Top story:ఓన్లీ ఫర్ ఫాన్స్…ఆకట్టుకోలేక పోయిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్… బిలో యావరేజ్.

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మారిన తర్వాత విడుదలైన మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. కేవలం ఫ్యాన్స్ పవర్ స్టార్ పై అభిమానంతో చూడాల్సిందే తప్ప ఉస్తాదులో మాస్, క్లాసు

Post Published By: dialnews
Updated : 20 March 2026, 9:49 AM IST

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మారిన తర్వాత విడుదలైన మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్
ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. కేవలం ఫ్యాన్స్ పవర్ స్టార్ పై అభిమానంతో చూడాల్సిందే తప్ప ఉస్తాదులో మాస్, క్లాసు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి ఏమీ లేదు. మొదటివారం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కలిసి కింద మీద పడి ఆడిస్తే ఉస్తాద్ సినిమా గట్టెక్కుతుంది. అన్నిటికీ మించి.. చేయగలిగేది ఏం లేదు. ఎప్పటిలాగే పవన్ సినిమా ఎలా పడితే అలా చుట్టేసి జనం మీదకి వదిలేసినట్లుగా స్పష్టమైపోయింది.

7.... 8 పాత సినిమాల నుంచి కథలన్నీ కాపీ కొట్టి, విజయ్ తమిళ్ తేరి మూవీ నుంచి మరికొంత సంగ్రహించి దానికి పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన వస్తాద్.... భగత్ సింగ్ రెండు పేర్లు కలిపి పెట్టి.... అర్థంపర్థం లేని కామెడీతో మిక్స్ చేసి... ఫ్యాన్స్ మీదకి వదిలిపెట్టాడు డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ చేసి, పవన్ కళ్యాణ్ కి ఏలినాటి శనిని వదిలించిన ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్,....8 ఏళ్ల పాటు ఎదురుచూసి చివరకు వస్తాద్ నీ కంపు కంపు చేసి వదిలిపెట్టాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం ఎంత కష్టమో తనకు తానే నిరూపించుకున్నాడు. మొత్తంగా ఫస్టాఫ్ అంతా బోర్ గా... సెకండ్ హాఫ్ కాస్త స్పీడ్ గా మాత్రం నడిచింది సినిమా.

హీరోని పెంచిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ఇది అంకుశం లో ఎప్పుడో పాతికేళ్ల క్రితం రాజశేఖర్ , జేవీ సోమయాజులు వేసిన పాత్రలు. విలన్ల అటాక్ లో పెళ్లికి ముందే హీరోయిన్ శ్రీ లీల చనిపోతుంది. తమిళ విజయ్ తేరి మూవీలో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్ చనిపోతుంది... అంతే తేడా. టెంపర్ లో రేప్ సీన్ పట్టుకొచ్చి వస్తాద్ లో అతికించేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్. నా గోత్రం.... నా మతం లాంటి పడికట్టు డైలాగులు సరిగ్గా పేలలేదు. మొత్తంగా అవినీతి నాయకులు... వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొంటాడు లాంటి పాత చింతకాయ పచ్చడి కలిపి వడ్డించేసాడు హరీష్ శంకర్. మధ్యలో చిరు పవన్ పాత సాంగ్స్ కాస్త ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తాయి. మేనరిజం,డాన్సులు నటనతో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు.

కానీ.... అవి ఏవి జనాన్ని ఆకట్టుకోవు. అవుట్ డేటెడ్ స్టోరీ... లాజిక్ లేని సీన్లు.... ఛీ దీనమ్మ ఎందుకు వచ్చాం రా సినిమాకి అనిపిస్తాయి. దేవి శ్రీ ప్రసాద్ ను మార్చి... చివర్లో తమన్ తో కొట్టించిన బిజిఎం సినిమాకి పెద్ద మైనస్. కామెడీ ఎక్కడ వర్కౌట్ కాలేదు. గబ్బర్సింగ్ లో అంత్య క్షరీకి బదులు వస్తాద్ లో పాత పాటలు పెట్టి నడిపించిన... మనకు ఎక్కడ నవ్వు రాదు. పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేకంగా ప్రేమ ఉంటే తప్ప ఈ సినిమా ధియేటర్లో చూడడం చాలా కష్టం. సినిమా రిలీజ్ అయ్యాక రిలీఫ్ గా ఫీల్ అయ్యేది ఇద్దరే. ఒకరు నిర్మాత. మరొకరు దర్శకుడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చి, దానికి వడ్డీలు కట్టి కట్టి... ఇన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ అనే సినిమా తీసి బయట పోయారు మైత్రి మూవీ మేకర్స్.8 ఏళ్ల క్రితం ఈ సినిమా మొదలుపెట్టి కెరీర్ మొత్తం నాశనం చేసుకొని, పవన్ దయతో ఏదోరకంగా సినిమా చుట్టిపడేసి బయటపడి మ మ అనిపించేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

వీళ్ళకి మాత్రమే ఈ సినిమా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. మిగిలిన జనాల అందరికీ పండగ పూట తలనొప్పి తప్పదు. నా బొమ్మ పెడితే చాలు.... నా బ్రాండ్ ఉంటే చాలు సినిమాలు కోట్లు కురిపిస్తాయి అనే భ్రమలోంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తే మంచిది. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ లేకుండా కేవలం హీరో ఫేస్ నీ పెట్టి నడిపించాలి... సినిమా హిట్ కొట్టాలి అని చవక బారు ప్లాన్లు వేస్తే చివరకు ఉస్తాద్ భగత్ సింగ్ ల అవుతుంది. సినిమాకి స్టోరీ... స్క్రీన్ ప్లే ఎంత అవసరమో దురంధర్ లాంటి మూవీస్ చూసి ఇప్పటికైనా మన వాళ్ళు వాస్తవాలను గుర్తించాలి.

 

Published : 
  • 20 March 2026, 9:49 AM IST