ఇగో వార్ శర్వానంద్ ‘బైకర్’…!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ వరుస విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'బైకర్'. భారతదేశంలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంటర్నెట్‌లో

Post Published By: dialnews
Updated : 24 March 2026, 10:50 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ వరుస విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'బైకర్'. భారతదేశంలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సాధారణంగా మనకు బైక్ రేసింగ్ అంటే రోడ్ల మీద చేసే స్పీడ్ ఛేజింగ్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ, 'బైకర్' టీమ్ అందుకు భిన్నంగా ఆఫ్-రోడ్ రేసింగ్ లేదా మోటోక్రాస్ క్రీడను ఎంచుకుంది. ట్రైలర్ చూస్తుంటే గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్‌ను పెంచేలా ఉన్నాయి.

ముఖ్యంగా శర్వానంద్ బైకర్ లుక్‌లో చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నాడు. కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయని అర్థమవుతోంది. ఒక తండ్రికి, తన కొడుకుకి మధ్య తలెత్తే 'ఇగో' ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సినిమాలో రొమాంటిక్ ట్రాక్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మాలవిక నాయర్, శర్వానంద్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఫ్రెష్‌గా ఉండబోతోంది. ఆటలో గెలవడమే కాదు, ఇంట్లో తండ్రి అంచనాలను తట్టుకుంటూ తనను తాను నిరూపించుకోవడానికి హీరో చేసే పోరాటమే ఈ 'బైకర్'. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై ఈ తరహా రేసింగ్ స్పోర్ట్స్ సినిమా రాలేదు.

ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది అని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమా కోసం శర్వానంద్ ఫిజికల్ అప్పీయరెన్స్‌తో పాటు రేసింగ్ టెక్నిక్స్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ రేసింగ్ సీక్వెన్స్‌లకు ప్రాణం పోశాయి. సినిమా యూనిట్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సమ్మర్ సీజన్‌కు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్‌గా ఇది నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Published : 
  • 24 March 2026, 10:50 AM IST