Top story:రక్షణ మంత్రిని బూతులు తిట్టిన ట్రంప్… వైట్ హౌస్ లో బూతుల వర్షం…!

సాధారణంగా మానసిక సమస్యలు ఉన్న వారికి మైండ్ నిలకడగా ఉండదు. ఏం మాట్లాడతారో అర్ధం కాదు.. ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ఇలాగే ఉంది. ఇరాన్ తో యుద్దాన్ని తేలికగా లెక్కేసిన ట్రంప్ కు కూసాలు కదలడంతో వణుకు

Post Published By: dialnews
Updated : 24 March 2026, 9:15 PM IST

సాధారణంగా మానసిక సమస్యలు ఉన్న వారికి మైండ్ నిలకడగా ఉండదు. ఏం మాట్లాడతారో అర్ధం కాదు.. ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ఇలాగే ఉంది. ఇరాన్ తో యుద్దాన్ని తేలికగా లెక్కేసిన ట్రంప్ కు కూసాలు కదలడంతో వణుకు పీక్స్ లో ఉంది. ఈ టైంలో తన కోపాన్ని కేబినేట్ మంత్రులపై చూపిస్తున్నాడు.. ఒకరకంగా రెచ్చిపోతున్నాడు. తాజాగా ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ పై రెచ్చిపోవడం.. హాట్ టాపిక్ గా మారింది.

అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఇది నిజంగా ఓ సెన్సేషన్. నిన్నటి దాకా 'నేను యుద్ధాన్ని ఆపుతాను' అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మాట మార్చారు. ఇరాన్ రియాక్షన్ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటం.. అమెరికా రక్షణ శాఖలో ప్రకంపనలు రేగుతున్నాయి. యుద్ధం వల్ల వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన సొంత రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌నే బలిపశువును చేస్తున్నారా? అనే అనుమానాలు చర్చనీయాంశం అయ్యాయి. 'చేసేద్దాం అని మీరే అన్నారు కదా' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. అసలు ట్రంప్ ఎందుకు ఇలా అన్నారు? పీట్ హెగ్సెత్ సమాధానం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇరాన్ మీద దాడులు, అంతర్జాతీయ ఆంక్షలు, పెరుగుతున్న చమురు ధరలతో అమెరికాలో ట్రంప్ గ్రాఫ్ పడిపోతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో తమ ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో ఆర్థిక నష్టం భారీగా ఉండటంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ టైంలో యుద్ధ నిర్ణయం తనది కాదని, అది తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన సలహా అని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. 'యుద్ధానికి వెళ్దాం, ఇరాన్ పని పడదాం అని పీట్ హెగ్సెత్ పట్టుబట్టారు.. అందుకే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను' అంటూ ట్రంప్ లేటెస్ట్ కామెంట్స్ చేసాడు.

పీట్ హెగ్సెత్ ముందు నుంచి.. ఇరాన్ విషయంలో కఠినంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. అయితే, యుద్ధం వల్ల అమెరికా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరుగుతుండటంతో బాధ్యత ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. ట్రంప్ తన బాధ్యతను పక్కన పెట్టి, పీట్ వచ్చి చేసేద్దాం అన్నాడు.. నేను ఓకే అన్నాను అని చెప్పడం ద్వారా, రేపు ఏదైనా తేడా జరిగితే తప్పు పీట్ హెగ్సెత్‌దే అని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇది ట్రంప్ మార్క్ పాలిటిక్స్ అని విశ్లేషకులు అంటున్నారు. తన మనుషులనే బలిపశువులను చేయడానికి ట్రంప్ వెనకాడరని మరోసారి రుజువైంది అంటున్నారు పరిశీలకులు.

గతంలో జపాన్ ప్రధాని దగ్గర పెర్ల్ హార్బర్ జోక్ వేసిన ట్రంప్, ఇప్పుడు యుద్ధం వంటి సీరియస్ విషయంలో కూడా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం అగ్రరాజ్య ప్రతిష్టను దిగజారుస్తోంది. ఒక పక్క చర్చలు అంటారు, మరోపక్క దాడులు చేస్తారు, ఇప్పుడు తప్పు నాది కాదు నా మంత్రిది అంటారు. ఈ గందరగోళం చూస్తుంటే, ట్రంప్ తన కంట్రోల్ కోల్పోతున్నారా? లేక ఇది కూడా ఒక పొలిటికల్ గిమ్మిక్కా? అనే అనుమానాలు వస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు కానీ, ట్రంప్ టీమ్ లో మాత్రం యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. పీట్ హెగ్సెత్ ఈ నిందను భరిస్తారా లేక రాజీనామా చేస్తారా? అనేది వేచి చూడాలి.

Published : 
  • 24 March 2026, 9:15 PM IST