ఇరాన్ మాట వింటే ఇజ్రాయిల్ కు ఒళ్ళు మంట. అసలు ఈ భూమి మీద.. ఆ దేశమే ఉండకూడదు అనుకునే పట్టుదల ఇజ్రాయిల్ ది. తన పదవీ కాలం ఉండగానే.. ఇరాన్ సుప్రీం లీడర్, అతని గ్యాంగ్ ను లేపేయాలి అనేది ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్లాన్. అందుకోసం.. తన బెస్ట్ ఫ్రెండ్ అమెరికా హెల్ప్ కావాలి. ఇంటర్నేషనల్ గా సపోర్ట్ రావాలన్నా.. గల్ఫ్ కంట్రీస్ సైలెంట్ గా ఉండాలన్నా, వార్ లో అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకే ఖమేనీ మర్డర్ స్కెచ్ ను.. రెడీ చేసుకుని, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కాల్ చేసాడు నెతన్యాహు. అసలు ఫిబ్రవరి 28 అటాక్ కు ముందు ఏం జరిగింది అనేదే ఇప్పుడు ప్రపంచానికి అర్ధం కాని విషయం. దానికి ఇంటర్నేషనల్ మీడియా ఆన్సర్ ఇచ్చింది.
డొనాల్డ్ ట్రంప్, బెన్జమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ ఇప్పుడు ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 'ఖమేనీని చంపేద్దాం.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి' అని నెతన్యాహు కోరడం, దానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. అంతా సెకన్ల మీద జరిగిపోయిందట. అసలు ఆ ఫోన్ కాల్ లో ఏం మాట్లాడారు? ప్రతీకారం తీర్చుకుంటామన్న ట్రంప్ ప్లాన్ ఏంటి? ఓ లుక్ వేద్దాం. ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. నెతన్యాహు స్వయంగా ట్రంప్‌కు ఫోన్ చేసి ఒక భీకరమైన ప్రతిపాదనను ముందుంచారు. 'ఖమేనీని లేపేయడానికి ఇంతకంటే మంచి అవకాశం మరెప్పుడూ రాదు' అని నెతన్యాహు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.ఇరాన్ ప్రస్తుతం బలహీనంగా ఉందని, ఇదే సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్‌ను లేపేస్తే అమెరికా, ఇజ్రాయెల్‌లకు తిరుగుండదని నెతన్యాహు.. ట్రంప్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. ముఖ్యంగా గతంలో ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ చేసిన ప్రయత్నాలను నెతన్యాహు గుర్తు చేశారు. 'మిమ్మల్ని చంపాలనుకున్న వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం' అని నెతన్యాహు చెప్పిన మాటలకు ట్రంప్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. గతంలో తనపై జరిగిన హత్యాయత్నాల వెనుక ఇరాన్ హస్తం ఉందన్నది ట్రంప్ గట్టి నమ్మకం.
అందుకే నెతన్యాహు ప్రతిపాదనకు ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 'ముందుకు వెళ్ళండి.. చేసేద్దాం' అంటూ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే, ఇరాన్ అగ్రనేత ఖమేనీకి మరణశిక్షను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఖరారు చేసినట్లే కనిపిస్తోంది. ఇది కేవలం ఒక దేశాధినేతను చంపడం మాత్రమే కాదు, ఇరాన్ అహంకారాన్ని దెబ్బతీయడం ద్వారా పశ్చిమాసియాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ట్రంప్ భావించినట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఇక ఆ మర్డర్ తర్వాతనే ఇరాన్ రెచ్చిపోయింది. అప్పటి వరకు సుప్రీం లీడర్ ఆదేశాలతో నడుస్తోంది అనుకున్న ఇరాన్.. ఆ తర్వాత కూడా సుప్రీం లీడర్ స్ఫూర్తితోనే వార్ భీకరంగా మార్చేసింది. దాడులు ప్రారంభం కావడానికి 48 గంటల ముందే ఈ ఫోన్ కాల్ జరిగింది. టెహ్రాన్‌లో జరగాల్సిన సమావేశాన్ని ఫిబ్రవరి 28 అంటే.. శనివారం రాత్రి నుండి శనివారం ఉదయానికి ముందుకు జరిపినట్లు మోసాద్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ తర్వాతనే ఈ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ కాల్ గురించి సమాచారం అందుకున్న ముగ్గురు వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ విషయాన్ని బయటపెట్టింది. నెతన్యాహు, ట్రంప్‌ల మధ్య సంభాషణ జరిగే సమయానికి, ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు ట్రంప్ అప్పటికే ఆమోదం తెలిపారని సమాచారం. అయితే, అమెరికా ఎప్పుడు, ఏ పరిస్థితులలో జోక్యం చేసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదట.