జరుగుతోన్న యుద్ధంలో, ఇరాన్ పిల్లిలా పారిపోతుందని అగ్రరాజ్యం అమెరికా విసిరిన సవాల్‌కు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 48 గంటల అల్టిమేటం ఇస్తే.. ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అడ్మిరల్ అలీ అక్బర్ ఆహ్మదియాన్ గర్జించారు. 'భయపడే కాలం పోయింది.. యుద్ధం కావాలా? అయితే రండి.. ఇంకా దగ్గరకు రండి!' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అసలు ఆహ్మదియాన్ ఏమన్నారు? ఆ 20 ఏళ్ల రహస్య వ్యూహం ఏంటి?డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ చమురు క్షేత్రాలను, పవర్ ప్లాంట్లను నామరూపాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దానికి అడ్మిరల్ ఆహ్మదియాన్ ఇచ్చిన రిటన్ గిఫ్ట్ మామూలుగా లేదు. 'మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. మీరు మా సరిహద్దుల దగ్గరకు వస్తే.. తిరిగి వెళ్లడానికి మీ దగ్గర ప్రాణాలు మిగలవు' అని తేల్చి చెప్పారు. 'కమ్ క్లోజర్' అంటూ ఆయన చెప్పిన వెల్కం.. ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అంటే, అమెరికా ఎంత దగ్గరకు వస్తే, అంత సులభంగా వారిని సముద్రంలో కలిపేస్తామన్నది ఆహ్మదియాన్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్.
ఈ స్ట్రాంగ్ వార్నింగ్ వెనుక బలమైన కారణం ఉంది. ఆహ్మదియాన్ ఒక సంచలన విషయం చెప్పారు: 'మేము ఈ క్షణం కోసమే గత 20 ఏళ్లుగా సిద్ధమవుతున్నాం!' అవును, మీరు విన్నది నిజమే. 20 ఏళ్లుగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను, డ్రోన్ టెక్నాలజీని, అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే గెరిల్లా యుద్ధ తంత్రాలను కేవలం అమెరికాను ఢీకొట్టడానికే డిజైన్ చేసుకుంది. అమెరికా దగ్గర అత్యాధునిక యుద్ధ విమానాలు ఉండవచ్చు.. కానీ ఇరాన్ దగ్గర ఆ విమానాలను గాల్లోనే పేల్చేసే 'సుసైడ్ డ్రోన్లు' వేల సంఖ్యలో ఉన్నాయి.ఇరాన్ నేల మీద అడుగుపెట్టడం అంటే.. అది అమెరికా సైనికులకు నరకమేనని ఆహ్మదియాన్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం కేవలం ఇరాన్, అమెరికాల మధ్యే కాదు.. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి. అడ్మిరల్ ఆహ్మదియాన్ సంకేతం స్పష్టంగా ఉంది. అమెరికా గనుక కదిలితే, ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి 'హోర్ముజ్ జలసంధి'ని మూసేస్తాం. ఒక్కసారి ఆ రూట్ క్లోజ్ అయితే.. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి, ప్రపంచం చీకట్లోకి వెళ్తుంది. ట్రంప్ తన '48 గంటల డెడ్ లైన్'తో భయపెట్టాలని చూస్తే.. ఆహ్మదియాన్ మాత్రం 'యుద్ధమే మా లక్ష్యం' అన్నట్టుగా ఎదురుదాడికి దిగుతున్నారు.
ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు.. మరోవైపు అమెరికా హెచ్చరికలు.. వీటన్నింటి మధ్య ఇరాన్ టాప్ అడ్మిరల్ చేసిన ఈ వ్యాఖ్యలు యుద్ధ జ్వాలలను మరింత రాజేస్తున్నాయి. 20 ఏళ్ల సన్నద్ధతతో ఉన్న ఇరాన్‌ను ట్రంప్ ఎదుర్కోగలరా? లేక ఇది మరో సుదీర్ఘ యుద్ధానికి దారితీస్తుందా? ఏది ఏమైనా, అడ్మిరల్ ఆహ్మదియాన్ మాటలు చూస్తుంటే.. ఇరాన్ వెనక్కి తగ్గేలా లేదు. ఇప్పటికే ఇరాన్ చేస్తున్న అటాక్స్.. మాటలకే పరిమితం కాదనే క్లారిటీ అమెరికా, ఇజ్రాయిల్ కు ఉంది. ఇలాంటి టైంలో కెలికితే.. జరిగేది.. ట్రంప్ ఊహకే వదిలేయవచ్చు.