Top story:ఇరాన్ పై ట్రంప్ దండయాత్ర…! ఒకేరోజు 1000కిలోల బాంబులతో దాడి…! 4 రోజుల్లో హర్ముజ్ జలసంధిపై బ్లాక్…?

హర్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన ట్రంప్‌...అంతలోనూ ప్లాన్‌ బీ అమలు చేస్తున్నారు. హర్ముజ్‌ను తెరిపించడానికి సుదీర్ఘ సమయం పట్టనుండటంతో...టెహ్రాన్‌ మిస్సైల్స్‌, ఆయుధ సంపత్తిని టార్గెట్ చేస్తోంది.

Post Published By: dialnews
Updated : 1 April 2026, 10:20 AM IST

హర్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన ట్రంప్‌...అంతలోనూ ప్లాన్‌ బీ అమలు చేస్తున్నారు. హర్ముజ్‌ను తెరిపించడానికి సుదీర్ఘ సమయం పట్టనుండటంతో...టెహ్రాన్‌ మిస్సైల్స్‌, ఆయుధ సంపత్తిని టార్గెట్ చేస్తోంది. వరుస బాంబుదాడులతో ఇరాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వెయ్యి కిలోల బంకర్ బస్టర్డ్‌ బాంబులను ప్రయోగించింది. హర్ముజ్‌ గుండా ప్రయాణించే నౌకలకు టోల్‌ వసూలు చేయాలని ఇరాన్‌ నిర్ణయించింది.అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధం భీకరరూపం దాలుస్తోంది. యుద్ధానికి విరామం అంటూ ప్రకటించిన అమెరికా...ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడుతోంది. హర్ముజ్‌ జలసంధిని బలవంతంగా తెరిపించాలని అనుకుంది. అయితే దీనికి 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అందుకే ఇరాన్ నౌకాదళాన్ని, క్షిపణి నిల్వలను దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ నౌకాదళం, క్షిపణి నిల్వలను బలహీనపరచడం అమెరికా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత యుద్ధాన్ని తగ్గిస్తూ, దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. గల్ఫ్, యూరప్ దేశాల సాయంతో వాణిజ్య మార్గాలను పునరుద్ధరించేలా ప్లాన్ చేస్తోంది. ఇరాన్‌లోని అణుకేంద్రాలు ఉన్న కీలక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా భారీగా దాడులు చేసింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై 2,000 పౌండ్ల బంకర్‌ బస్టర్‌ బాంబులతో దాడికి దిగింది. ఈ దాడికి సంబంధించి వీడియోలను ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా తెరవకపోయినప్పటికీ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తన సహాయకులకు సూచించినట్లు సమాచారం.
--
ఓ వైపు ఇరాన్‌ నుంచి భూతల, గగనతల దాడులను ఎదుర్కొంటూనే...మరోవైపు క్షిష్టతరమైన ఆపరేషన్‌ను విజయవంతం చేయడం అమెరికాకు సవాల్‌గా మారింది. అందుకే ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలను లేకుండా చేయడమే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన అమెరికా, ఆ దిశగా ప్రణాళికలు చేస్తోంది. ఇందుకోసమే ఇరాన్‌లో అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా భూతల దాడులకు సిద్ధమైంది. ఇరాన్‌ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 400 కిలోలు, 20 శాతం ఫిస్సైల్ మెటీరియల్ దాదాపు 200 కిలోల వరకు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేశాయి. వీటిని 90 శాతం వెపన్-గ్రేడ్ యురేనియంగా మార్చి ...ఇరాన్ సులభంగా అణ్వాయుధాలు తయారు చేయగలదని అమెరికా ఆందోళన చెందుతోంది. అదే జరిగితే ఎప్పటికైనా తమకు ముప్పేనని ఇజ్రాయెల్‌, అమెరికా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇరాన్‌ వద్ద ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా భారీ సైనిక ఆపరేషన్‌ చేపట్టింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తమ అణు నిల్వలను అప్పగించడమే యుద్ధ ముగింపునకు ఏకైక షరతని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారు. టెహ్రాన్‌ స్వచ్ఛందంగా ఇవ్వకపోతే, బలవంతంగానైనా ఆ నిల్వలను లాక్కోవాలనే ప్లాన్‌తో ఉన్నారు.

హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోల్ వసూలు చేసేందుకు ఉద్దేశించిన హర్మూజ్ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇకపై ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ రూపంలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా, జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రత బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్‌ నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్ పార్లమెంట్ పూర్తిగా నిషేధించింది. ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలకు కూడా అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఈ వ్యూహాత్మక జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని చాటుకుంటూనే ఆదాయాన్ని పెంచుకోవాలని ఇరాన్ యోచిస్తోంది.

Published : 
  • 1 April 2026, 10:20 AM IST