2వ దేవర oct.. థౌజెండ్ వాలా పేలుస్తూ…!

దేవర మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫేట్ ని మార్చిన ప్రాజెక్ట్. రాజమౌలి సాయం లేకుండా, ఎన్టీఆర్ సొంతం చేసుకున్న బ్లాక్ బస్టర్. అది కూడా త్రిబుల్ ఆర్ లాంటి మైల్ స్టోన్ వచ్చాకే.. అందుకే దేవర సీక్వెల్ ఎప్పుడూ హాట్ టాపికే.. డ్రాగన్ రెండు

Post Published By: dialnews
Updated : 2 April 2026, 4:50 PM IST

దేవర మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫేట్ ని మార్చిన ప్రాజెక్ట్. రాజమౌలి సాయం లేకుండా, ఎన్టీఆర్ సొంతం చేసుకున్న బ్లాక్ బస్టర్. అది కూడా త్రిబుల్ ఆర్ లాంటి మైల్ స్టోన్ వచ్చాకే.. అందుకే దేవర సీక్వెల్ ఎప్పుడూ హాట్ టాపికే.. డ్రాగన్ రెండు భాగాలుగా మార్చినా... ఆ ప్రాజెక్ట్ కోసమే బల్క్ గా ఎన్టీఆర్ తన డేట్లు ఇచ్చినా. ఎప్పడూ దేవర సీక్వెల్ ని నెగ్లెక్ట్ చేయలేదు. త్రివిక్రమ్ ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ కూడా దేవర సీక్వెల్ కి అడ్డు పడే ఛాన్స్ లేకుండా ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నాడు.. దీపావలికి థౌజెండ్ వాలా పేల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొరటాల శివకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు.. ఇంతకి దేవర సీక్వెల్ ఏరోజు పట్టాలెక్కబోతోంది? ఎప్పుడు వస్తుంది? ఎన్నిరోజుల డేట్స్ ఈమూవీ కోసం ఎన్టీఆర్ కేటాయించాడు?

దేవర 2 ఏర్పాట్లు సడన్ గా మొదలయ్యాయి. కొరటాల శివ తన టోటల్ టీంతో ఇప్పడు దేవర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మార్పులతో ఫుల్ బిజీ అయ్యాడు. ఒక వైపు డ్రాగన్ షూటింగ్ పనులే దసరా వరకు కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి.. ఇలాంటి టైంలో దేవర 2 పనులు మొదలవ్వటం విచిత్రం గా ఉంది. ఎందుకంటే ఎప్పుడో దేవర 2 తాలూకు ప్రీ ప్రొడక్షణ్ పనులు పూర్తి చేశాడు కొరటాల శివ.అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఇంకో లెక్క లా కనిపిస్తోంది. కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాలిడ్ గా డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సెషన్ కాదు. ఏకంగా 180 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశాడట ఎన్టీఆర్. అక్టోబర్ థర్డ్ వీక్ నుంచి మోస్ట్ లీ అక్టోబర్ 20 కి దేవర 2 లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నవంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.

అప్పటి నుంచి 180 రోజుల కాల్ షీట్స్ అంటే, కనీసం 2027 సమ్మర్ ఎండ్ వరకు ఈ సినిమా షూటింగ్ జరగొచ్చు. దేవర మొదటి భాగానికి కూడా ఎన్టీఆర్ ఇన్ని కాల్ షీట్స్ ఇవ్వలేదట. 145 రోజుల కాల్ షీట్సే ఇచ్చాడు. ఇప్పుడు సీక్వెల్ కి మరో నెలకుమించి కాల్ షీట్స్ ఇవ్వటం చూస్తే, దేవర 2 కథ లో జరిగిన మార్పుల విషయంలో ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టే తెలుస్తోంది.దేవర మొదటి భాగంతో పోలిస్తే, అసలు కథంతా దేవర 2లోనే ఉందన్నాడు కొరటాల శివ. ఇప్పుడు ఆ అసలు కథలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పటికే రెండు సార్లు ఫైనల్ స్క్రిప్ట్ ని మార్చిన కొరటాల శివ, ఈమధ్యే మూడో సారి కథలో చాలా మార్పులు చేయటమే కాదు, కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ తో వెళ్లి ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే డేట్లు కూడా పర్ఫెక్ట్ గా కన్పామ్ చేసి ఇచ్చేశాడట ఎన్టీఆర్.

ఏరకంగా కూడా త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ఈ సినిమా దేవర2 కి బ్రేకులేయదనే ప్రామిస్ తోనేఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లమన్నాడట ఎన్టీఆర్. కుదిరితే త్రివిక్రమ్ మైథాలజీ, కూడా దేవర2 కి ప్యార్ లల్ గా తెరకెక్కే ప్లాన్ం చేయటం తప్ప, మరేరకంగా ఇబ్బందులు లేకుండా చూస్తానని ఎన్టీఆర్ అన్న మాటతో, కొరటాల శివలో ఎక్కడ లేని ఊపొచ్చింది. కలిసొచ్చిన దేవరకి సీక్వెల్ అంటే అందుకు డబుల్ ఇంపాక్ట్ బాక్సాఫీస్ మీద కనిపించే ఛాన్స్ఉంది. సో అందుకే దేవర 2 తాలూకు ప్రీ ప్రొడక్షన పనులన్నీ, రీ సెట్ చేస్తూ, టీంని అలర్ట్ చేస్తున్నాడు కొరటాల శివ.

Published : 
  • 2 April 2026, 4:50 PM IST