Top story:24 గంటల్లో అమెరికాను ఉ*చ్చపోయించిన ఇరాన్… ఇరాన్ ఆర్మీ సంచలన ప్రకటన…!

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గడిచిన 24 గంటల్లో ఇరాన్ సాయుధ దళాలు ఆకాశంలో మృత్యు తాండవం చేశాయి. 'మా గగనతలంలోకి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లలేరు' అని ఇరాన్ హెచ్చరించినట్లే..

Post Published By: dialnews
Updated : 6 April 2026, 9:26 AM IST

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గడిచిన 24 గంటల్లో ఇరాన్ సాయుధ దళాలు ఆకాశంలో మృత్యు తాండవం చేశాయి. 'మా గగనతలంలోకి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లలేరు' అని ఇరాన్ హెచ్చరించినట్లే.. అమెరికా గర్వపడే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను పిట్టల్లా రాల్చేసింది. ఎఫ్-15, ఎఫ్-16, ఏ-10.. ఒకటా రెండా? ఇరాన్ ఏకంగా ఒక యుద్ధ విమానాల స్మశానవాటికను సృష్టించింది. అసలు ఇరాన్ దగ్గర ఉన్న ఆ 'బ్రహ్మాస్త్రం' ఏంటి? అమెరికా టెక్నాలజీని ఇరాన్ ఎలా మట్టికరిపించింది? ఈ వీడియో చూస్తే.. ఇరాన్ దమ్ము ఏంటో మీకు అర్థమవుతుంది.ఇరాన్ అధికారికంగా ప్రకటించిన జాబితా చూస్తుంటే పెంటగాన్ అధికారులకు నిద్ర పట్టడం లేదు. నిన్నటి నుంచి జరిగిన వేటలో. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్.. అమెరికా వెన్నెముక లాంటి ఈ విమానాన్ని ఇరాన్ తన సరిహద్దుల్లోనే కూల్చివేసింది. ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్: పర్షియన్ గల్ఫ్ నీళ్లలో ఈ విమానం సమాధి అయిపోయింది. ఏ-10 వార్ థగ్: ట్యాంకులను వేటాడే ఈ 'మృత్యు యంత్రాన్ని' కూడా ఇరాన్ వదిలిపెట్టలేదు. అలాగే.. అమెరికా నిఘా నేత్రాలైన 3 MQ-9 రీపర్ డ్రోన్లు, ఒక హెర్మెస్ డ్రోన్, ఒక వింగ్ లూంగ్ 2 డ్రోన్.. అన్నీ ఇరాన్ క్షిపణుల ధాటికి ముక్కలయ్యాయి.

ఇంతేకాదు, రెండు కేసి-135 స్ట్రాటోట్యాంకర్లు అంటే.. గాల్లో ఇంధనం నింపే విమానాలు.. ప్రాణభయంతో '7700 ఎమర్జెన్సీ కోడ్' ఇచ్చి పారిపోయాయంటే ఇరాన్ సృష్టించిన భయం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది.. రెండు బోయింగ్ కేసి-135 స్ట్రాటోట్యాంకర్లు, ఒక ఎఫ్-16 విమానం 'కోడ్ 7700' జారీ చేశాయి. ఏవియేషన్ భాషలో దీని అర్థం 'మేము ప్రమాదంలో ఉన్నాం, మాకు అత్యవసర సహాయం కావాలి' అని. గాలిలో ఇంధనం నింపే విమానాలే భయపడి పారిపోతున్నాయంటే, ఇక ఫైటర్ జెట్లు గాల్లో ఎంతసేపు ఉండగలవు ? ఇరాన్ రాడార్లు వాటిని లాక్ చేయగానే అమెరికా పైలట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.అమెరికా దగ్గర ఉన్న 'స్టెల్త్' టెక్నాలజీ అంటే.. రాడార్లకు దొరకని సాంకేతికత. ఇరాన్ ముందు పనిచేయడం లేదా? అవును.. ఇరాన్ సొంతంగా తయారు చేసుకున్న బావర్ -373 డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు రష్యా ఎస్-400 కంటే పవర్‌ఫుల్ అని నిరూపించుకుంది. ఈ సిస్టమ్ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న 60 లక్ష్యాలను ఒకేసారి గుర్తించి, వేటాడగలదు. ముఖ్యంగా 'ఖోర్దాద్-15' అనే మిస్సైల్ సిస్టమ్ ద్వారా అమెరికా స్టీల్త్ విమానాలను కూడా ఇరాన్ గుర్తిస్తోంది. ఇరాన్ దమ్ము ఏంటంటే.. కేవలం రష్యా, చైనా మీద ఆధారపడకుండా, తమ సొంత సాంకేతికతతో అమెరికా గర్వాన్ని అణచివేయడం.

వారి రాడార్లు అమెరికా సిగ్నల్ జామర్లను కూడా తట్టుకుని విమానాలను లాక్ చేస్తున్నాయి. యుద్ధ విమానాలు కూలిన తర్వాత తమ పైలట్లను రక్షించుకోవడానికి అమెరికా పంపిన HH-60W జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్లు కూడా ఇరాన్ దెబ్బకు విలవిల్లాడాయి. ఇరాన్ చేసిన దాడుల్లో ఈ హెలికాప్టర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా పంపే డ్రోన్లను ఇరాన్ తన 'ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్' ద్వారా హైజాక్ చేస్తోందా అనే అనుమానాలు కూడా వ్యూహకర్తల్లో మొదలయ్యాయి. ఒక పైలట్ అమెరికా దళాల చేతికి చిక్కగా, మరొక పైలట్ ఇరాన్ భూభాగంలో ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి.ఇరాన్ కమాండోలు ఆ పైలట్ కోసం వేట మొదలుపెట్టారు. ఒకవేళ ఆ పైలట్ ఇరాన్ చేతికి చిక్కితే, అది అమెరికాకు అంతర్జాతీయంగా పెద్ద అవమానం అవుతుంది.

ఈ విమానాల కూల్చివేతపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. 'మేము యుద్ధంలో ఉన్నాం, కానీ ఇది చర్చలను ఆపదు' అని ఒక వింత వాదన చేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 'ముందు దాడులు ఆపండి, ఆపై చర్చలు' అని ఇరాన్ భీష్మించుకుని కూర్చుంది.ట్రంప్ మాత్రం మరో 2 నుంచి 3 వారాల్లో యుద్ధం ముగిసిపోతుందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇరాన్ ఇస్తున్న కౌంటర్లు చూస్తుంటే.. అమెరికా తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ కోల్పోయేలా కనిపిస్తోంది.. చివరగా.. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక పంపింది. ఆకాశంలో ఆధిపత్యం మీదే కావచ్చు, కానీ మా నేల మీదకు వస్తే అది మీ సమాధి అవుతుందని నిరూపించింది. ఈ యుద్ధం ముగింపు ఎక్కడికి దారితీస్తుంది? అమెరికా తన ఓటమిని ఒప్పుకుంటుందా? లేక అణ్వాయుధాల దాడికి దిగుతుందా? చూడాలి.

Published : 
  • 6 April 2026, 9:26 AM IST