Top story:వాట్సాప్ ప్రైవసీ అంతా పులిహోరే, బయటపడ్డ సంచలన నిజం… బెడ్ రూమ్ లో తొంగి చూస్తోంది… డ్రైవ్ లో బ్యాకప్ వద్దురోయ్…!

నమస్తే బాస్.. ఎలా ఉన్నారు..? ఈరోజు ఒక చిన్న ప్రశ్న.. మీ పర్సనల్ విషయాలు, ఆఫీస్ గాసిప్స్, మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌తో చేసే 'ముచ్చట్లు' ఎక్కడ పడితే అక్కడ చెబుతారా..? చెప్పరు కదా..? మరి వాట్సాప్‌లో ఎందుకు చెప్తున్నారు..?

Post Published By: dialnews
Updated : 11 April 2026, 9:00 PM IST

నమస్తే బాస్.. ఎలా ఉన్నారు..? ఈరోజు ఒక చిన్న ప్రశ్న.. మీ పర్సనల్ విషయాలు, ఆఫీస్ గాసిప్స్, మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌తో చేసే 'ముచ్చట్లు' ఎక్కడ పడితే అక్కడ చెబుతారా..? చెప్పరు కదా..? మరి వాట్సాప్‌లో ఎందుకు చెప్తున్నారు..? 'అరే.. అక్కడ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కదా బ్రో' అని మీరు అనొచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. మనం గుడ్డిగా నమ్మే ఆ ఎన్‌క్రిప్షన్ వెనుక ఉన్న అసలు రంగు బయటపడింది. అమెరికాలో పడ్డ ఒక లా సూట్ ఇప్పుడు వాట్సాప్ కొంప ముంచేలా ఉంది. అసలు వాట్సాప్ సేఫ్ కాదా..? మన మెసేజ్‌లను మెటా చదువుతోందా..? అసలు విషయాన్ని ఈ రోజు బ్రేక్ చేద్దాం.

అమెరికాలో మెటా కంపెనీ మీద ఒక కేసు ఫైల్ అయింది. ఆ పిటిషన్ లో ఏముందంటే.. 'మేము మీ మెసేజ్‌లు చదవం, మాకు కూడా యాక్సెస్ ఉండదు' అని వాట్సాప్ చెప్పే మాటలన్నీ ఉత్తుత్తివేనట. వాట్సాప్ దగ్గర మన ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లను చూసే వీలుందని, బ్యాక్ డోర్ ఎంట్రీలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం..? ఆ తాళం గుర్తు కనిపిస్తే మన మెసేజ్ మనకు, అవతలి వ్యక్తికి తప్ప దేవుడికి కూడా తెలియదు అనుకున్నాం. కానీ ఇప్పుడు తేలిందేంటంటే.. ఆ దేవుడి కంటే ముందే 'మార్క్ జుకర్‌బర్గ్' బాబాయ్ మీ మెసేజ్‌లను చూస్తున్నాడట.

అసలు ఈ ఎన్‌క్రిప్షన్ అంటే ఏంటో తెలుసా? మీరు 'హాయ్' అని పంపితే, అది దారిలో ఏదో పిచ్చి కోడ్ లాగా మారిపోయి అవతలి వాడికి వెళ్తుంది. ఇది ఒక ఇనుప పెట్టె లాంటిది, దీని తాళం చెవి మీ ఇద్దరి దగ్గరే ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ లా సూట్ ఏం చెప్తుందంటే.. ఆ పెట్టెకు వెనుక వైపు నుంచి ఒక చిన్న రంధ్రం ఉందట, దాని ద్వారా మెటా అన్నింటినీ గమనిస్తోందట. అంటే మన పడకగది ముచ్చట్లు కూడా వాళ్ళకి డేటా పాయింట్స్ అన్నమాట. ఏంటి గురూ..? మన ప్రైవసీని ఇంతలా వాడుకుంటున్నారా..?

ఇక్కడే అసలు కామెడీ ఉంది. ఇండియాలో మన గవర్నమెంట్ ఏమంటుంది..? 'ఎవరైనా తప్పుడు మెసేజ్‌లు వైరల్ చేస్తే, ఆ మెసేజ్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు చెప్పండి' అని అడుగుతోంది. దానికి వాట్సాప్ ఏమని సమాధానం ఇచ్చింది..? 'అమ్మో.. మా దగ్గర ఎన్‌క్రిప్షన్ ఉంది, మేము అలా ట్రేస్ చేస్తే ప్రైవసీ పోతుంది, మా వల్ల కాదు' అని ఢిల్లీ హైకోర్టులో వాదిస్తోంది. ఇప్పుడు అమెరికా కేసు గనుక నిజమని తేలితే.. వాట్సాప్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా..? 'దొంగ దొరికిపోయాక.. నేను నీతిమంతుడిని' అని చెప్పినట్టు ఉంటుంది.

అంటే వాళ్ళ దగ్గర డేటా యాక్సెస్ పెట్టుకుని కూడా, గవర్నమెంట్‌కు ఇవ్వకుండా హైకోర్టులో బిల్డప్ ఇస్తున్నారన్నమాట. పోనీ వీళ్ళేదో దేశ భద్రత కోసం చూస్తున్నారా అంటే అదీ లేదు. మీరు వాట్సాప్‌లో మీ ఫ్రెండ్‌కి 'ఒక కొత్త షూ కొనాలిరా' అని మెసేజ్ చేయండి.. మరుసటి నిమిషమే ఇన్‌స్టాగ్రామ్ లో, ఫేస్‌బుక్ లో మీకు షూ అడ్వర్టైజ్మెంట్లే కనిపిస్తాయి. అదేంటి గురూ....? మెసేజ్ చదవకుండా అడ్వర్టైజ్మెంట్లు ఎలా వస్తాయి..? ఇది యాదృచ్ఛికం అని వాళ్ళు చెప్తారు.. కానీ మనందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుందో.

మెసేజ్ లోపల ఏముందో చదవక్కర్లేదు బాబాయ్, మెటాడేటా ఉంటే చాలు. అంటే.. మీరు ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? ఎన్నింటికి చేస్తున్నారు? ఎంత సేపు కాల్ మాట్లాడుతున్నారు? మీ లొకేషన్ ఏంటి? ఈ వివరాలన్నీ వాట్సాప్ దగ్గర పక్కాగా ఉంటాయి. "మేము మెసేజ్ చదవం కానీ, మీరు ఎవరితో గోలీలాడుతున్నారో మాకు తెలుసు" అన్నట్టు ఉంటుంది వీళ్ళ వ్యవహారం. మనం మన చాట్స్ అన్నీ భద్రంగా ఉండాలని గూగుల్ డ్రైవ్‌లోనో, ఐక్లౌడ్‌లోనో బ్యాకప్ పెడతాం కదా..? అక్కడ ఎన్‌క్రిప్షన్ ఉండదు.. మనం మాన్యువల్‌గా ఆన్ చేస్తే తప్ప.

అంటే వాట్సాప్ నుంచి బయటకు వెళ్ళిన మీ డేటా ఓపెన్ బుక్ అన్నమాట. దొంగకి ఇంటి తాళాలు ఇచ్చి 'కాపలా కాయ్' అన్నట్టు ఉంటుంది ఇది. ఎవరైనా మనకు నచ్చని మెసేజ్ పంపితే 'రిపోర్ట్' చేస్తాం కదా..? అలా రిపోర్ట్ చేసినప్పుడు, ఆ మెసేజ్‌తో పాటు దాని ముందున్న ఐదు మెసేజ్‌లు కూడా వాట్సాప్ సర్వర్‌కి వెళ్తాయి. అప్పుడు ఎన్‌క్రిప్షన్ ఏమైపోతుంది బాబాయ్..? అంటే వాళ్ళ దగ్గర మెసేజ్‌లు చదివే 'మాస్టర్ కీ' ఎప్పుడూ ఉందనే కదా దీని అర్థం..? ప్రైవసీ గురించి ఇంత బిల్డప్ ఇచ్చే వాట్సాప్.. అసలు ప్రైవసీ ఇచ్చే 'సిగ్నల్' లాంటి యాప్స్ గురించి ఎందుకు భయపడుతుంది..?

ఎందుకంటే సిగ్నల్ లాంటివి మీ ఫోన్ నంబర్ తప్ప ఇంకేమీ స్టోర్ చేయవు. కానీ వాట్సాప్ కి మీ కాంటాక్ట్స్, మీ స్టేటస్ అప్‌డేట్స్, మీ ఫోన్ మోడల్.. అబ్బో ఒక జాతకమే కావాలి. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఎలా ఉంటుందంటే.. 'నీ బెడ్ రూమ్ లోకి ఎవరూ రారు బాబాయ్, కాకపోతే కిటికీలో నుంచి మేము మాత్రం చూస్తూ ఉంటాం, దాన్ని ప్రైవసీ అంటారు' అని చెప్పినట్టు ఉంటుంది. మనం ఏదైనా వెబ్‌సైట్ లింక్ వాట్సాప్‌లో షేర్ చేయగానే, ఆ వెబ్‌సైట్ ప్రివ్యూ కనిపిస్తుంది కదా..? అది ఎలా వస్తుంది..? వాట్సాప్ సర్వర్ ఆ లింక్‌ని ముందే ఓపెన్ చేసి చెక్ చేస్తేనే కదా ఆ ఇమేజ్ వచ్చేది. అంటే మనం ఏం లింకులు పంపుకుంటున్నామో కూడా వాళ్లకు తెలుసు.

'ప్రైవసీ.. ప్రైవసీ' అని యాడ్స్ ఇచ్చి కోట్లు ఖర్చు పెడతారు కానీ, లోపల మాత్రం మన డేటాతో వ్యాపారం చేస్తారు. సో.. బాస్ , ముగింపు ఏంటంటే.. ఈ కాలంలో ఏదీ ఫ్రీ కాదు. ఒక సర్వీస్ ఫ్రీగా వస్తుందంటే, అక్కడ మనం 'కస్టమర్లం కాదు.. మనమే ఒక ప్రొడక్ట్' అన్నమాట. అమెరికా కేసు తేలేదాకా వాట్సాప్ ప్రైవసీ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమే. కాబట్టి వీలైనంత వరకు పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్లు, పాస్‌వర్డ్‌లు వాట్సాప్‌లో షేర్ చేయకపోవడమే మంచిది. లేదంటే రేపు మీ పాస్‌వర్డ్ అమెరికా సర్వర్లలో ఊరేగుతూ ఉంటుంది.

Published : 
  • 11 April 2026, 9:00 PM IST