యుద్ధం అంటే భయం.. అగ్రరాజ్యం అంటే వణుకు.. ఇవేవీ ఇరాన్ డిక్షనరీలో లేవు. 'మీ ట్రిక్కులు మా దగ్గర సాగవు మిస్టర్ ట్రంప్.. ఇకపై చర్చలు ఉండవు, సమావేశాలు ఉండవు.. యుద్ధ భూమిలోనే తేల్చుకుందాం' అంటూ ఇరాన్ ఆర్మీ చేసిన ప్రకటన ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు విఫలమయ్యాక, అమెరికా బృందం తోక ముడిచి వెళ్ళిపోయాక.. ఇరాన్ గొంతులో కనిపిస్తున్న ఆ ధైర్యం సామాన్యమైనది కాదు. ప్రపంచానికి వెన్నెముక లాంటి 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మా కంట్రోల్ లోనే ఉంది, ఎవడైనా అడుగు పెడితే సమాధి చేస్తాం అంటూ ఇరాన్ చేసిన సవాల్ అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
అమెరికాకు ఇరాన్ ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా..? 'మీరు చర్చల పేరుతో కాలాన్ని వృధా చేస్తున్నారు, మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఇకపై మీ ముఖం కూడా చూడటానికి మేము సిద్ధంగా లేము' అని తెగేసి చెప్పింది. 'We know your tricks mr. drump' అంటూ ట్రంప్ దౌత్య నీతిని ఎద్దేవా చేస్తూ ఇరాన్ ఆర్మీ చేసిన కామెంట్స్ చూస్తుంటే.. వాళ్ళు యుద్ధానికి మానసికగా సిద్ధమైపోయారని అర్థమవుతోంది. దౌత్యం ముగిసింది.. ఇక ధ్వంసమే మిగిలి ఉంది.
ఇరాన్ ఆర్మీ ట్రంప్‌ను 'Mr. Drump' అని సంబోధించడం వెనుక పెద్ద అర్థమే ఉంది. ఇది కేవలం పేరు మార్చడం కాదు, ఆయనను ఎగతాళి చేస్తూ, అమెరికా అధ్యక్ష పదవిని తాము గౌరవించడం లేదని చెప్పడం. ప్రపంచాన్నే వణికించే ట్రంప్‌ను 'మిస్టర్ డ్రంప్' అంటూ ఇరాన్ వెక్కిరించింది. అంటే.. 'నీ బెదిరింపులకు భయపడే కాలం పోయింది, నీ ట్రిక్కులన్నీ మాకు తెలుసు' అని ముఖం మీదే ఉమ్మివేసినంత పని చేసింది ఇరాన్ ఆర్మీ. మరి ప్రపంచం మొత్తం ఇరాన్ వైపు ఎందుకు భయంగా చూస్తోంది..?
దానికి కారణం 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'. ప్రపంచంలోని మూడొంతుల చమురు రవాణా జరిగే ఈ మార్గం ఇప్పుడు పూర్తిగా ఇరాన్ ఆర్మీ గుప్పిట్లో ఉంది. 'ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదు' అని ఇరాన్ స్పష్టంగా చెప్పింది. దీని అర్థం ఏంటో తెలుసా..? అమెరికా గానీ, దాని మిత్రదేశాలు గానీ తోక ఆడిస్తే.. ప్రపంచం చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్ కేవలం బాంబులతో కాదు.. ప్రపంచ దేశాల ఆకలితో, అవసరంతో యుద్ధం చేయగలదు. ఆ దమ్ముంది కాబట్టే ఇరాన్ ఇంత పవర్‌ఫుల్‌గా మాట్లాడుతోంది.
ప్రస్తుతం 14 రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంది. కానీ ఇది శాంతి కోసం కాదు.. తుఫాను ముందు ఉన్న నిశ్శబ్దం మాత్రమే. ఈ 14 రోజుల్లో ఇరాన్ తన క్షిపణులను సిద్ధం చేస్తోంది, తన అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ నుండి డ్రోన్లను మొహరిస్తోంది. ఈ గడువు ముగిసిన మరుక్షణం.. మధ్యప్రాచ్యంలో అగ్నిప్రళయం మొదలవ్వబోతోంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. చర్చల్లో కూర్చోవడానికి ఇష్టపడని ఇరాన్.. ఇక రణరంగంలోనే సమాధానం చెప్పబోతోంది.
సాధారణంగా దేశాలు యుద్ధం వద్దు అనుకుంటే చర్చలు జరుపుతాయి. కానీ ఇరాన్ 'ఇకపై మీటింగ్స్ లేవు' అని చెప్పిందంటే.. వాళ్ళు తుపాకీకి పని చెప్పాలని ఫిక్స్ అయ్యారు. మిస్సైల్స్ ను రంగంలోకి దించాలని రెడీ అయ్యారు. చర్చల ముసుగులో అమెరికా ఆడే డ్రామాలకు ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టింది. 'మా సమయాన్ని వృధా చేయకండి, మీ కాన్ఫరెన్స్‌లు మాకు వద్దు' అని చెప్పడం ద్వారా ఇరాన్ తన క్షిపణులకు పదును పెడుతోంది. ఇది దౌత్యవేత్తల సమయం కాదు.. ఇది సైనికుల సమయం అని క్లారిటీ ఇచ్చేసింది.
ఈ 14 రోజుల కాల్పుల విరమణను ఇరాన్ శాంతి కోసం వాడుకోవడం లేదు, తన సైన్యాన్ని రీ-గ్రూప్ చేసుకోవడానికి మరియు సరిహద్దుల్లో భారీ ఎత్తున ఆయుధాలు మొహరించడానికి వాడుకుంటోంది. ఈ 14 రోజులు అమెరికాకు ప్రాణభిక్ష మాత్రమే. ఈ గడువు ముగిసిన మరుక్షణం మధ్యప్రాచ్యంలో రక్తం ఏరులై పారుతుంది. ఇరాన్ తన బంకర్ల నుండి వేల సంఖ్యలో డ్రోన్లను, క్షిపణులను బయటకు తీసింది. ఏ క్షణమైనా పెను విస్ఫోటనం సంభవించవచ్చు. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది, కానీ ఇరాన్ తన ఉనికి కోసం పోరాడుతోంది.
అమెరికా దగ్గర టెక్నాలజీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు.. చావడానికైనా సిద్ధమైన వాడిని ఆయుధాలతో భయపెట్టలేరు. ఇరాన్ ఆర్మీ ప్రకటనలో ఆ చావు భయం లేని ధైర్యం స్పష్టంగా కనిపిస్తోంది. తమ గడ్డపై పరాయి దేశం పెత్తనాన్ని ఇరాన్ సహించదు. రష్యా, చైనా వంటి శక్తుల పరోక్ష మద్దతుతో పాటు, అత్యంత శక్తివంతమైన మిస్సైల్ టెక్నాలజీ ఇరాన్ సొంతం. ట్రంప్ బెదిరింపులకు భయపడి ఉంటే ఇరాన్ ఎప్పుడో లొంగిపోయేది. కానీ వాళ్ళు ఎదురు నిలిచారు. 'మీ ట్రిక్కులు మా దగ్గర సాగవు' అని ముఖం మీద చెప్పే మొండితనం ఇరాన్ గొప్పతనం.
ఇది అగ్రరాజ్యం అహంకారానికి.. ఒక చిన్న దేశం ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఫైనల్ గా.. ఒక దేశం ఇంత బహిరంగంగా అగ్రరాజ్యాన్ని సవాల్ చేస్తోందంటే.. ఆ దేశం దగ్గర ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండాలి..? ఇరాన్ సవాల్ విసిరింది.. డోంట్ వేస్ట్ టైం అంటుంది. యుద్దానికి.. రమ్మని పిలిచింది. మరి అమెరికా ఈ సవాల్‌ను స్వీకరిస్తుందా..? లేక ఇరాన్ దెబ్బకు భయపడి వెనక్కి తగ్గుతుందా..? 14 రోజుల తర్వాత ఏం జరగబోతోంది..? ప్రపంచ యుద్ధం మొదలవుతుందా..? అనేది చూడాలి.