మధ్యప్రాచ్యంలో రక్తం మరిగిపోతోంది. అగ్రరాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా.. ఇరాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే, ఇరాన్ ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న అరాచకాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేడు చారిత్రాత్మక వార్నింగ్ ఇచ్చారు. 'ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయి జాగ్రత్త' అంటూ అమెరికా గూబ గుయ్‌మనేలా అల్టిమేటం జారీ చేశారు. తన సొంత సముద్ర తీరంలో ఇరాన్ వ్యాపారాన్ని అడ్డుకునే ధైర్యం అమెరికాకు ఎక్కడిది..? అరాఘ్చీ మాటల వెనుక ఉన్న ఆ రహస్య ఆయుధం ఏంటి..? అమెరికా అహంకారాన్ని ఇరాన్ ఎలా మట్టికరిపించబోతోంది..? ఈ వీడియోలో చూద్దాం.
అసలు ఏం జరుగుతోందంటే.. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అమెరికా హోర్ముజ్ జలసంధిలో 'సముద్రపు దొంగ'లా ప్రవర్తిస్తోంది. ఇరాన్ ఓడరేవులపై అక్రమంగా దిగ్బంధనం విధిస్తోంది. దీనిపై అరాఘ్చీ నిప్పులు చెరిగారు. నేడు ఆయన చైనా, జపాన్ విదేశాంగ మంత్రులతో మాట్లాడుతూ.. అమెరికా చేస్తున్న ఈ 'పైరసీ'ని ప్రపంచం ముందు ఎండగట్టారు. 'ఇరాన్ ఓడరేవులను ఆపే శక్తి ఏ దేశానికీ లేదు. మీరు రెచ్చగొడితే.. ఆ పరిణామాలు మీ ఊహకు అందవు' అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ కేవలం మాటలు చెప్పడం లేదు.. తన సముద్ర సరిహద్దుల్లో యుద్ధ నౌకలను రంగంలోకి దించి అమెరికాకు చుక్కలు చూపిస్తోంది.
హోర్ముజ్ జలసంధి అంటే అమెరికా తాత సొత్తు కాదు. అది ఇరాన్ కంచుకోట. ప్రపంచ వ్యాపారంలో 30% చమురు ఇక్కడి నుంచే వెళ్తుంది. ఏప్రిల్ 13 నుండి అమెరికా ఇక్కడ పది ఓడలను అక్రమంగా ఆపేసింది. దీనిపై అరాఘ్చీ పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. 'ఐక్యరాజ్యసమితిలో మీరు వేసిన వెకిలి వేషాలను చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. ఇకనైనా మీ ఆధిపత్యం నడవదని తెలుసుకోండి' అని హెచ్చరించారు. అమెరికా అహేతుక తీర్మానాలను ఇరాన్ మిత్రదేశాలు తృణీకరించడం.. ఇరాన్ సాధించిన దౌత్య విజయం. ఇప్పుడు అమెరికాకు దిక్కు తోచడం లేదు. ఇరాన్ ఓడరేవులను మూసేయాలని చూస్తే, హోర్ముజ్ జలసంధినే మూసేసే శక్తి ఇరాన్ కు ఉందని అరాఘ్చీ గుర్తు చేశారు.
అరాఘ్చీ తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కార్గో షిప్పులను అడ్డుకోవడం అనేది కేవలం రెచ్చగొట్టడం మాత్రమే కాదు, అది అంతర్జాతీయ సముద్ర చట్టాలను తుంగలో తొక్కడమే. అమెరికా తనని తాను చట్టబద్ధమైన దేశం అని చెప్పుకుంటూనే, నడి సముద్రంలో పైరసీకి పాల్పడుతోందని ఇరాన్ ఇప్పుడు ప్రపంచం ముందు నిరూపించింది. అరాఘ్చీ ఈ హెచ్చరిక చేసే ముందు చైనా మరియు జపాన్ విదేశాంగ మంత్రులతో మాట్లాడటం ఒక మాస్టర్ స్ట్రోక్.
చైనా ఇరాన్ కి వెన్నెముకగా నిలబడి, అమెరికా వేసిన అడ్డగోలు తీర్మానాలను ఐక్యరాజ్యసమితిలో అడ్డుకుంది. అమెరికాకు మిత్రురాలైనప్పటికీ, ఇరాన్ తో చర్చలు జరపడం అంటే.. అమెరికా చర్యలను జపాన్ కూడా పూర్తిగా సమర్థించడం లేదని అర్థం. అంటే, దౌత్యపరంగా అమెరికాను ఇరాన్ ఒంటరి చేసింది. అరాఘ్చీ అన్న ఆ 'ప్రమాదకర పరిణామాలు' అనే మాట వెనుక ఒక భారీ విధ్వంసం దాగి ఉంది. అమెరికా గనుక దిగ్బంధనం ఎత్తివేయకపోతే.. ఇరాన్ తన ఎర్ర సముద్రం వ్యూహాన్ని అమలు చేస్తుంది. అంటే, అమెరికాకు అనుకూలంగా ఉండే ఏ ఒక్క నౌక కూడా ఆ దారిలో ప్రయాణించలేదు.
అమెరికా తన సైన్యాన్ని రక్షించుకోవచ్చు ఏమో కానీ, ఇరాన్ నిఘా నీడలో ఉన్న గల్ఫ్ దేశాల విద్యుత్ కేంద్రాలు, పోర్టులు, గ్యాస్ ప్లాంట్లు దెబ్బతింటే అమెరికా ఆదుకోలేదని అరాఘ్చీ పరోక్షంగా హెచ్చరించారు. "మీరు మా వ్యాపారాన్ని దెబ్బతీస్తే.. మేము మీ మిత్రదేశాల మనుగడనే దెబ్బతీస్తాం" అనే ధీటైన హెచ్చరిక ఇది. ఇప్పటికే ఇస్లామాబాద్ లో జరిగిన సీజ్ ఫైర్ చర్చలను అమెరికా తన మొండితనంతో చెడగొట్టింది. ఇస్లామాబాద్‌లో జరిగిన కాల్పుల విరమణ చర్చలు అమెరికా మొండితనం వల్లే విఫలమయ్యాయని అరాఘ్చీ బయటపెట్టారు.
శాంతి కావాలని ఇరాన్ కోరుకుంటున్నా, అమెరికా మాత్రం యుద్ధాన్నే కోరుకుంటోందని, ఒకవేళ యుద్ధం వస్తే దానికి బాధ్యత అమెరికాదే అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు.ఇప్పుడు అరాఘ్చీ అల్టిమేటం ఒక్కటే.. 'మా ఓడరేవులను మీరు అడ్డుకుంటే.. మీ మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలను మేము స్మశానాలుగా మారుస్తాం'. ఇరాన్ దగ్గర ఉన్న హైపర్ సోనిక్ మిస్సైళ్లు అమెరికా నౌకాదళాన్ని సెకన్ల వ్యవధిలో సముద్ర గర్భంలో కలిపేయగలవు. ఇరాన్ ఇప్పుడు ఒక శక్తివంతమైన ధ్రువంగా మారింది. అమెరికా బెదిరింపులకు భయపడే రోజులు పోయాయి. అబ్బాస్ అరాఘ్చీ చేసిన ఈ హెచ్చరికతో అమెరికా రక్షణ శాఖ వణికిపోతోంది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే మొగాడు లేడని తేలిపోయింది. ఇది కేవలం ఒక దేశం గెలుపు కాదు.. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ సాధించిన గొప్ప విజయం.