అమెరికా తలుపులు బద్దలు కొట్టుకుని ఇరాన్ గూఢచారులు లోపలికి దూరిపోయారా..? పెంటగాన్ కళ్లద్దాలు తీసి చూసేలోపే 70 మిలియన్ డాలర్ల డ్రోన్ల డీల్ ముగిసిపోయిందా..? లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్ట్‌లో షమీమ్ మాఫీ అనే మహిళ అరెస్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి..? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలకు వెళ్తున్న టైమ్‌లోనే ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది..? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే.అమెరికా నిఘా వ్యవస్థలైన ఎఫ్‌బీఐ, పెంటగాన్‌ల ముక్కు కిందనే ఇరాన్ ప్రభుత్వం ఒక భారీ ఆయుధ నెట్‌వర్క్‌ను నడిపిన తీరు ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇరాన్ సంతతికి చెందిన అమెరికా నివాసి షమీమ్ మాఫీ అనే 44 ఏళ్ళ మహిళ.. లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్ట్ లో అరెస్టవ్వడంతో, ఇరాన్ గూఢచార సంస్థలు అమెరికా గడ్డపై ఎంతలా పాగా వేశాయో వెలుగులోకి వచ్చింది. అమెరికాలోనే నివాసం ఉంటూ, ఇరాన్ నిఘా సంస్థలతో టచ్‌లో ఉండి భారీ ఆయుధ ఒప్పందాలు నడపడం ఇప్పుడు పెంటగాన్ అధికారులను ఉలిక్కిపడేలా చేస్తోంది.
అసలు ఈ షమీమ్ మాఫీ ఎవరు? 2013లో ఇరాన్ విడిచిపెట్టి, 2016లో అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించిన ఒక సాధారణ మహిళ. కానీ 2020లో సీన్ రివర్స్ అయింది. ఇరాన్‌లో ఆమె తండ్రి ఆస్తులను అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. "నీ ఆస్తులు నీకు కావాలంటే.. మా కోసం అమెరికాలో ఉండి పని చెయ్" అని ఇరాన్ నిఘా సంస్థ ఆఫర్ ఇచ్చింది. ఆ వ్యాపారానికి అయ్యే ప్రతి రూపాయి మేమే ఇస్తాం అని టెహ్రాన్ భరోసా ఇచ్చింది. ఇక్కడే ఇరాన్ మాస్టర్ మైండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. శత్రువు దేశంలోనే తన మనిషిని కూర్చోబెట్టి, అక్కడి నుంచే ప్రపంచ ఆయుధ మార్కెట్‌ను శాసించింది ఇరాన్.మాఫీ ఒక సాదాసీదా మహిళ కాదు బాస్.. ఇరాన్ గూఢచార వర్గాలకు ఆమె ఒక మాట చెప్పింది. "నేను ఇరాన్‌లో ఉండటం కంటే.. అమెరికాలో ఉంటేనే మీకు ఎక్కువ లాభం. ఇక్కడి నుంచే నేను ఆపరేషన్స్ నడపగలను" అని. అంటే అమెరికాలో ఉంటూనే, అమెరికా చట్టాలను వాడుకుంటూనే, ఇరాన్ డ్రోన్లను ప్రపంచానికి అమ్మే ప్లాన్ సిద్ధం చేసింది. 2022 నుంచి 2025 వరకు మూడు ఏళ్ల పాటు పెంటగాన్ ముక్కు కిందనే ఈమె నెట్‌వర్క్ నడిచింది. అమెరికా నిఘా వ్యవస్థ ఎంత డొల్లగా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
ఈమె కుదిర్చిన డీల్స్ మామూలువి కావు గురూ.. సుమారు 580 కోట్ల రూపాయల విలువైన 'మొహాజెర్-6' డ్రోన్లు. ఇవి చిన్న చిన్న డ్రోన్లు కావు.. సూడాన్ అంతర్యుద్ధంలో శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న కిల్లర్ మెషీన్స్. కేవలం డ్రోన్లే కాదు.. 55 వేల బాంబు ఫ్యూజులను కూడా ఆమె సరఫరా చేసింది. 10 మిలియన్ల ఏకే-47 బుల్లెట్లు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇలా ఒక యుద్ధానికి కావలసిన సర్వం ఈమె అమెరికా నుంచి బ్రోకరింగ్ చేసింది. టర్కీ, యూఏఈ మీదుగా ఈ నెట్‌వర్క్ నడిచింది.ఇరాన్ టెక్నాలజీ ప్రపంచానికి ఎంత అవసరమో, దాన్ని ఆపడం అమెరికా వల్ల కాదని ఈ ఘటన నిరూపించింది. అమెరికా ఏమో ప్రపంచ దేశాల మీద ఆంక్షలు విధిస్తుంది.. కానీ ఇరాన్ మాత్రం తన టెక్నాలజీని అమెరికా నుంచే ఎగుమతి చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇరాన్ దెబ్బకు ఇప్పుడు అమెరికా రక్షణ శాఖకు ఉచ్చపడుతోంది. ఈ అరెస్ట్ టైమింగ్ చూస్తే మీకు మతిపోతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌లో ఇరాన్ ప్రతినిధులతో చర్చలకు వెళ్తున్న తరుణంలోనే ఈ అరెస్ట్ జరిగింది.
అంటే ఇరాన్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికే అమెరికా ఈ అరెస్ట్ డ్రామా ఆడుతోందా..? మాఫీ మాత్రం గట్టిగా చెబుతోంది "నేను ఏ తప్పూ చేయలేదు, ఇరాన్ నన్ను ఆదేశించలేదు" అని. ఇది కేవలం ఒక మహిళ మీద చేస్తున్న కక్ష సాధింపు చర్య మాత్రమేనా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు అమెరికా గడ్డపై నుంచే సూడాన్ వంటి దేశాలకు 70 మిలియన్ డాలర్ల విలువైన సాయుధ డ్రోన్లు సరఫరా చేయడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉందో అర్థమవుతోంది.మాఫీ తన బినామీ కంపెనీ ద్వారా కేవలం ఆయుధాలే కాదు, ఇతర వాణిజ్య వస్తువులను కూడా రవాణా చేసేది. దీనివల్ల అధికారులకు అనుమానం రాకుండా ఉండేది. ఆయుధాలను "అగ్రికల్చరల్ ఎక్విప్‌మెంట్" లేదా "జనరల్ కార్గో" పేరుతో తరలించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ నిఘా అధికారులతో మాట్లాడేటప్పుడు ఆమె డైరెక్ట్‌గా ఆయుధాల పేర్లు వాడకుండా, కోడ్ భాషలో అంటే ఉదాహరణకు డ్రోన్లను 'పక్షులు' అని, బుల్లెట్లను 'గింజలు' అని మాట్లాడేదని సమాచారం. అమెరికా నుంచి నేరుగా ఇరాన్‌కో, సూడాన్‌కో పంపడం రిస్క్ కాబట్టి, టర్కీ మరియు దుబాయ్‌లోని కొన్ని షెల్ కంపెనీల ద్వారా ఈ ఆయుధాలను దారి మళ్లించేవారు. ఇది ఒక భారీ 'గ్లోబల్ సప్లై చైన్'.
2022 నుండి 2025 వరకు ఈమె కార్యకలాపాలు సాగిస్తున్నా, ఇప్పుడే అరెస్ట్ అవ్వడం అమెరికా ఇంటర్నల్ సెక్యూరిటీపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. షమీమ్ మాఫీ లాంటి వారు ఇంకా ఎంతమంది అమెరికాలో ఉండి ఇరాన్ లేదా ఇతర దేశాల కోసం పని చేస్తున్నారో అన్న భయం పెంటగాన్‌ను వెంటాడుతోంది. బినామీ కంపెనీల నెట్‌వర్క్ కూడా భారీగా ఉంది. ఒమన్ కేంద్రంగా అట్లాస్ ఇంటర్నేషనల్ వంటి బినామీ కంపెనీలు సృష్టించి అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్వారానే ఆయుధ లావాదేవీలు జరపడం అధికారులకు సవాల్‌గా మారింది.అమెరికాలోని ఇరాన్ వ్యతిరేక వర్గాల సమాచారాన్ని కూడా టెహ్రాన్‌కు చేరవేసేదని, అంటే కేవలం ఆయుధ బ్రోకరే కాదు, ఒక ఇన్ఫార్మర్‌గా కూడా పనిచేసిందని మరో టాక్. చూసారు కద.. ఇరాన్ తన పౌరులను, తన టెక్నాలజీని వాడుకుని అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఎలా ముప్పుతిప్పలు పెడుతోందో. పెంటగాన్ ఎన్ని నిఘా కెమెరాలు పెట్టినా, ఇరాన్ మైండ్ గేమ్ ముందు అవి దిగదుడుపే. షమీమ్ మాఫీ అరెస్ట్ అమెరికా పతనానికి ఆరంభమా..? అనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి.